Samajwadi Party: బాబ్రీ మసీదుపై వివాదం.. ప్రతిపక్ష కూటమి నుంచి సమాజ్‌వాదీ పార్టీ బయటకు..
- ఎంవీఏ నుంచి బయటకు వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ..
- బాబ్రీ మసీదు కూల్చివేతపై ఉద్ధవ్ సన్నిహితుడి వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samajwadi Party: బాబ్రీ మసీదు కూల్చివేతపై ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో విభేదాలకు కారణమైంది. ఈ వ్యాఖ్యల కారణంగా కూటమిలోని ‘‘సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)’’ ఎంవీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. బాబ్రీ మసీదును కూల్చివేత 32వ వార్షికోత్సవం సందర్భంగా శివసేన(ఠాక్రే) నేత మిలింద్ నార్వేకర్ మసీదు ఫోటోని పోస్ట్ చేశారు. శివసేన పితామహుడు బాలాసాహెబ్ ఠాక్రే ఫోటోని పోస్ట్ చేసి ‘‘ ఇది చేసిన వారిని చూసి నేను గర్వపడుతున్నాను’’ అని ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే చిత్రాలను పోస్ట్ చేశారు.
ఈ పరిణామం ఎంవీఏలో చీలికలకు కారణమైంది. మహారాష్ట్రలో సమాజ్‌వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, ఎన్సీపీ శరద్ పవార్‌ల పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయొద్దని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిని ధిక్కరించి ఎస్పీ ఎమ్మెల్యేలు అబూ అసిమ్ అజ్మీ, రైస్ షేక్ ఇద్దరు ప్రమాణస్వీకారం చేశారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?
‘‘బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని అభినందిస్తూ శివసేన (UBT) ఒక వార్తాపత్రికలో ఒక ప్రకటన ఇచ్చింది. అతని (ఉద్ధవ్ థాకరే) సహాయకుడు కూడా మసీదు కూల్చివేతను అభినందిస్తూ X లో పోస్ట్ చేశాడు’’ అని మహారాష్ట్ర ఎస్పీ చీఫ్ అజ్మీ చెప్పాడు. తాము ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కి కూడా చెప్పామని, కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాంగ్రెస్ కూటమిలో ఎవరైనా ఇలాంటి భాష మాట్లాడితే, వారికి బీజేపీకి మధ్య తేడా ఏంటి..? వారితో మేము ఎందుకు ఉండాలి..? అని ఎస్పీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమతమైంది. కాంగ్రెస్-16, ఉద్ధవ్ సేన -20, ఎన్సీపీ శరద్ పవార్-10 సీట్లు ఇతర పార్టీలు మరో 3 సీట్లను మాత్రమే సాధించాయి. అయితే, ఈవీఎంలో మోసాల వల్లే బీజేపీ కూటమి గెలిచిందంటూ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది. ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించారు. ఇది మహారాష్ట్ర ప్రజల ఆదేశం కాదని, ఈవీఎంలు, ఎన్నికల సంఘం ఆదేశం అని ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే అన్నారు.
— Milind Narvekar (@NarvekarMilind_) December 5, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!