Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను మతసామరస్యాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. తాను ‘‘క్రైస్తవుడినని గర్విస్తున్నాను’’ అని ప్రకటించుకుుంటూనే, అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ.. విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
BJP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ‘‘ అంబేద్కర్ ’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.
Arvind Kejriwal: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, డీఎంకే ఇతర ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, తన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి, కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందిన నిన్న అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
Rahul Gandhi: అమిత్ షా రాజ్యసభ స్పీచ్‌పై పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌కి చెందిన ఎంపీలు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, ఎడిటెడ్ వీడియోను ప్రచారం చేస్తోందని, నిజానికి అంబేద్కర్‌ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
Congress: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతన ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీకి అల్టిమేటం జారీ చేశారు. అయితే, తన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తప్పుపట్టిస్తోందని అమిత్ షా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Bombay High Court: రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే హోర్డింగులపై బాంబే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలపై వారికి ఎలాంటి గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి డీకే ఉపాధ్యాయం, జస్టిస్ అమిత్ బోర్కర్లతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర అంతటా ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగులపై వేసిన పిటిషన్‌ని విచారించింది.
Betting App: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న బెట్టింగ్ యాప్ రాకెట్లో పాకిస్తాన్ కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పాక్ జాతీయుడికి చెందిన వ్యక్తిదే ఈ బెట్టింగ్ యాప్ అనేది విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మ్యాజిక్‌విన్ బెట్టింగ్ యాప్‌లో పాకిస్తానీ కోణాన్ని ఈడీ కనిపెట్టడం ఇదే తొలిసారి.
Monkeypox: కేరళలో ఇద్దరికి మంకీపాక్స్(ఎంపాక్స్) కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం తెలిపారు. ఇద్దరు కూడా ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి ఇటీవల కేరళకు తిరగి వచ్చారు. ఇద్దరు వ్యక్తులను పరీక్షించగా ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని ఆమె చెప్పారు. వయనాడ్ జిల్లాకు చెందిన వారిలో ఒకరికి మొదటగా వ్యాధి సోకినట్లు గుర్తించగా, కన్నూర్‌కి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. Read Also: Bandi Sanjay: రూ.224 కోట్ల సీఆర్ఐఎఫ్ […]
India-China: భారత్-చైనాల మధ్య సంబంధాల బలోపేతం కోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ హాన్ జెంగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరమైన అభివృద్ధిలోకి తీసుకురావడానికి రెండు దేశాలు క్రమంగా ఆర్థిక, వాణిజ్య, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పరం సహకారాన్ని పునరుద్ధరించాలని ఆయన అన్నారు.
Doklam issue: మరోసారి చైనా తన దొంగబుద్ధిని చాటుకుంది. గత 8 ఏళ్లుగా భూటాన్ భూభాగమైన డోక్లామ్ సమీపంలో 22 గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వీటిలో 8 గ్రామాలు 2020 నుంచి వ్యూహాత్మక డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉండగా ఈ పరిణామం జరిగింది.