Arvind Kejriwal: చంద్రబాబు, నితీష్‌లకు కేజ్రీవాల్ లేఖ.. విషయం ఏంటంటే.
- రాజ్యసభలో అమిత్ షా ‘‘అంబేద్కర్’’ వ్యాఖ్యలపై దుమారం..
- చంద్రబాబు, నితీష్ కుమార్‌లకు లేఖ రాసిన కేజ్రీవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, డీఎంకే ఇతర ఇండియా కూటమి పార్టీలు ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, తన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి, కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందిన నిన్న అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, అమిత్ షా వ్యాఖ్యలపై ఈ రోజు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై టీడీపీ, జేడీయూలకు లేఖలు రాయడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన లేఖలు రాశారు. ఈ రెండు పార్టీలు బీజేపీ అధికారాన్ని సాధించేందుకు అవసరమైన ఎంపీలను సమకూర్చాయి. ఎన్డీయే మెజారిటీ ఫిగర్ దాటేందుకు సాయపడ్డాయి.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Rahul Gandhi: పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీని తోసేసిన రాహుల్ గాంధీ.. తలకు గాయం..
‘‘బాబాసాహెబ్ కేవలం నాయకుడు మాత్రమే కాదు, మన జాతికి ఆత్మ. బీజేపీ చేసిన ప్రకటన తర్వాత, మీరు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలని ప్రలు ఆశిస్తున్నారు.’’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.
మంగళవారం రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు. ప్రతిపక్ష నేతల తీరును తప్పుబడుతూ..‘‘ఇప్పుడు ప్రతిపక్షాలు అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది, ఇంతలా దేవుడు పేరు తలుచుకుంటే వారికి స్వర్గంలో చోటు లభించి ఉండేది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలే మొత్తం వివాదానికి కారణమైంది. అయితే, ఈ స్పీచ్‌లోని కొంత భాగాన్ని కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ నేతలు షేర్ చేసుకున్నారు.
AAP national convener Arvind Kejriwal writes to Andhra Pradesh CM and TDP chief N Chandrababu Naidu over Union Home Minister Amit Shah's statement on Babasaheb Ambedkar.
"…Babasaheb is not just a leader but the soul of our nation. After this statement by the BJP, people… pic.twitter.com/F8h3jEpgVV
— ANI (@ANI) December 19, 2024
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!