Betting App: పాకిస్తాన్ బెట్టింగ్ రాకెట్‌కి భారత సెలెబ్రిటీల ప్రచారం..!
- బెట్టింగ్ యాప్ రాకెట్‌లో పాకిస్తాన్ కోణం.. పాక్ జాతీయుడికి చెందినదిగా గుర్తింపు.. మ్యాజిక్‌విన్‌కి భారత సెలబ్రెటీల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting App: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న బెట్టింగ్ యాప్ రాకెట్‌లో పాకిస్తాన్ కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పాక్ జాతీయుడిదే ఈ బెట్టింగ్ యాప్ అనేది విచారణలో తేలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మ్యాజిక్‌విన్ బెట్టింగ్ యాప్‌లో పాకిస్తానీ కోణాన్ని ఈడీ కనిపెట్టడం ఇదే తొలిసారి. భారత్ నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కి ఈ డబ్బు పంపినట్లు తెలుస్తోంది. బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ల నుంచి నటులు,సెలబ్రిటీలు సోషల్ మీడియాలో మ్యాజిక్‌విన్ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశారు.
Read Also: Iron Rich Fruits: ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.. తప్పక తినండి!
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
- IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
ఇప్పటికే నటీనటులు మల్లికా షెరావత్, పూజా బెనర్జీలను ఈడీ ప్రశ్నించింది. ఈ వారాంతంలో మరో ఇద్దరు సెలబ్రిటీలకు ఈడీ సమన్లు పంపింది. రానున్న వారంలో మరో ఏడుగురు సెలబ్రిటీలకు కూడా సమన్లు అందుతాయని తెలుస్తోంది. మ్యాజిక్‌విన్ అనేది గేమింగ్ వెబ్‌సైట్, ఇది దుబాయ్‌లో ఉంటున్న భారతీయ పౌరులచేత ఆపరేట్ చేయబడుతోంది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న బెట్టింగ్ గేమ్స్ ఫిలిప్పీన్స్ వంటి బెట్టింగ్ చట్టబద్ధమైన ఇతర దేశాల నుంచి నడుస్తున్నాయని ఈడీ వర్గాలు చెప్పాయి.
గేమ్స్ API ఇతర సోర్సెస్ నుంచి కాపీ చేయబడి మ్యాజిక్‌విన్‌లో తిరిగి ప్రసారం అవుతున్నాయని తేలింది. ఈ బెట్టింగ్ యాప్ చాలా సోషల్ మీడియా అకౌంట్స్‌ని కలిగి ఉంది. వీటిని భారతదేశంలో ప్రచారం చేసుకునేందుకు ఉపయోగించుకుంటోంది. ఈ కేసులో గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 67 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, పూణేలలో మ్యాజిక్‌విన్ కేసుతో సంబంధం ఉన్న 21 మంది వ్యక్తులపై గత వారం ఈడీ దాడులు నిర్వహించి సుమారు రూ.3.55 కోట్లను స్వాధీనం చేసుకుంది. యాప్‌పై అహ్మదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ చర్యలు తీసుకుంది. పేమెంట్ గేట్‌వేలు, షెల్ కంపెనీల అగ్రిగేటర్ల ద్వారా బెట్టింగ్ విజేతల డబ్బను వారి ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఇదే కాకుండా దేశీయ నగదు బదిలీ(డీఎంటీ) ద్వారా కూడా ప్లేయర్లకు డబ్బు పంపబడుతోంది.
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!