Divorce Case: బిడ్డకు పేరు పెట్టే విషయంపై భార్యభర్తల మధ్య జరిగిన గొడవ చివరకు విడాకులు వరకు వెళ్లింది. తమ బిడ్డకు పేరు పెట్టడంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై దంపతులు విడాకులు కోరిన ఘటన కర్ణాటకలో జరిగింది. 26 ఏళ్ల వ్యక్తి 2021లో జన్మించిన తన కుమారుడి పేరు పెట్టే కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో వివాదం మొదలైంది.
MH370 Plane: 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన మలేషియా విమానం MH370, ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అత్యాధునిక సాంకేతికత, సముద్రంలో వేల మైళ్లను జల్లెడ పట్టినా కూడా ఒక్క శకలం కూడా లభించలేదు.
Google Layoffs: టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతను ప్రకటించింది. మేనేజ్మెంట్, వైస్ ప్రెసిడెంట్ లెవల్ స్థాయి ఉద్యోగాల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ఈసీఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వ్యూహాత్మక ప్రాధాన్యతలు, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా ఈ లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య వర్క్‌ఫోర్స్‌ని క్రమబద్దీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన ఆల్-హ్యాండ్ మీటింగ్‌లో సుందర్ పిచాయ్ సమర్థతను పెంచడానికి ఉద్యోగాల కోతను ప్రకటించారు.
Yogi Adityanath: మొఘల్ పాలకుడు ఔరంగజేబు, అతని వారసులను ఉద్దేశించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఔరంగజేబు వారసులు ఇప్పుడు కలకత్తా సమీపంలో నివసిస్తున్నారని, జీవించడానికి రిక్షాలు నడుపుకుంటూ బతుకుతున్నారని అన్నారు. ‘‘ఇది చరిత్ర యొక్క దైవిక న్యాయం’’గా అభివర్ణించారు. ఔరంగజేబు దైవత్వాన్ని ధిక్కరించి, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలపై విధ్వంసక చర్యలకు పాల్పడ్డాడని చెప్పారు. Read Also: KTR Case: హైకోర్టులో కేటీఆర్ […]
Atul Subhash Case: భార్య తప్పుడు కేసులతో వేధింపులకు గురైన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ కేసులో ఇప్పటికే సుభాష్ భార్య నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, బంగ్లాదేశ్‌కి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ పాలన పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహహస్తం అందిస్తోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ నాయకుడు మహ్మద్ యూనస్ గురువారం మాట్లాడుతూ.. తానున పాకిస్తాన్‌తో సంబంధాల బలోపేతానికి అంగీకరించానని చెప్పారు. ఈ పరిణామం భారత్‌కి ఇబ్బందికలిగించేలా మారింది.
Cars24 CEO: కన్నడ అంటే ఆ కర్ణాటకలోని ప్రజలకు ఎంత అభిమానమో అందరికి తెలుసు. అయితే, ఇది ఇటీవల కాలంలో దురభిమానంగా మారుతోంది. వేరే ప్రాంతాల నుంచి బెంగళూర్, ఇతర కర్ణాటక ప్రాంతాల్లో పనిచేసే వారు తప్పకుండా కన్నడ మాట్లాడాలని ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కన్నడ మాట్లాడని వారిపై దాడులు చేస్తున్నారు.
UP: ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్తగా పెళ్లయిన వ్యక్తికి ‘‘ఫస్ట్ నైట్’’లో షాక్ తగిలింది. కొత్త పెళ్లికూతురు తొలి రాత్రి బీరు, గంజాయి, మేక మాంసం కోరడంతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కి చేరింది. తొలి రాత్రి ‘‘ ముహ్ దిఖాయ్’’ ఆచారంలో వధువు బీరు కావాలని కోరింది. దీంతో భర్త ఒకింత ఆశ్చర్యపోయినప్పటికీ, ఆమె బీరు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆ తర్వాత గంజాయి, మేక మాంసం అడగడంతో షాక్ అయ్యాడు.
Honeymoon: ‘‘హనీమూన్ డెస్టినేషన్’’కి సంబంధించి మామ అల్లుడి మధ్య గొడవ చివరకు యాసిడ్ దాడికి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర థానే జిల్లాకు చెందిన 29 ఏళ్ల కొత్తగా పెళ్లయిన వ్యక్తి తన భార్యతో హనీమూన్ కోసం కాశ్మీర్ వెళ్తామనుకున్నాడు. అయితే, దీనిపై వివాదం చెలరేగడం మామ అతడిపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో అల్లుడు గాయపడినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ‘‘హత్యాయత్నం’’ కేసు పెట్టారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ ఎంపీలపై కుట్ర, దుష్ప్రవర్తన కేసులను పెట్టింది. అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలపై ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.