Monkeypox: కేరళలో ఇద్దరికి మంకీపాక్స్(ఎంపాక్స్) కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం తెలిపారు. ఇద్దరు కూడా ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) నుంచి ఇటీవల కేరళకు తిరగి వచ్చారు. ఇద్దరు వ్యక్తులను పరీక్షించగా ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని ఆమె చెప్పారు. వయనాడ్ జిల్లాకు చెందిన వారిలో ఒకరికి మొదటగా వ్యాధి సోకినట్లు గుర్తించగా, కన్నూర్‌కి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Read Also: Bandi Sanjay: రూ.224 కోట్ల సీఆర్ఐఎఫ్ నిధులు మంజూరు చేయండి.. గడ్కరీకి బండి సంజయ్ వినతి
ఇద్దరు రోగులు ప్రస్తుతం కన్నూర్‌లోని పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి కాంటాక్ట్‌లను ట్రేస్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. రోగులతో పరిచయం ఉన్నవారు లక్షణాలు ఏవైనా ఉన్నాయో లేదో చూసుకోవాలని కోరారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే నివేదించాలని చెప్పారు. ఆరోగ్య మంత్రి ఆధ్వర్యంలో సమావేశమైన రాష్ట్ర స్థాయి రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (RRT), పరిస్థితిని అంచనా వేయడానికి సమావేశాన్ని నిర్వహించింది, అదనపు ఐసోలేషన్ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేసింది.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు లక్షణాలు కనిపించిన వెంటనే తమను తాము ఐసోలేట్ చేసుకోవాలని, వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య శాఖ కోరింది. ఎయిర్ పోర్టులతో పాటు అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేశారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కూడా కేరళలో కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.