Rahul Gandhi: పార్లమెంట్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ఎంపీని తోసేసిన రాహుల్ గాంధీ.. తలకు గాయం..
- అమిత్ షా రాజ్యసభ స్పీచ్‌పై పార్లమెంట్ ఆవరణలో ఉద్రిక్తత..
- బీజేపీ ఎంపీని తోసేసిన రాహుల్ గాంధీ..
- ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు గాయం..
- బీజేపీ ఎంపీలే తమని బెదిరించారన్న రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: అమిత్ షా రాజ్యసభ స్పీచ్‌పై పార్లమెంట్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతోంది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌కి చెందిన ఎంపీలు అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని, ఎడిటెడ్ వీడియోను ప్రచారం చేస్తోందని, నిజానికి అంబేద్కర్‌ని అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే అని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
Read Also: Poco C75: తక్కువ ధరకే 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ.. నేటి నుంచే అమ్మకాలు షురూ..
Also Read
- Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
- Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
- PM Modi: చెప్పడమే కాదు.. చేసి చూపించారు.. పెట్రోల్ సేవ్ చేసేందుకు 'కాన్వాయ్' కట్ చేసిన ప్రధాని మోడీ!
- NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
ఇదిలా ఉంటే, గురువారం పార్లమెంట్ కమర్ దావర్(గేటు) వెలుపల జరిగిన గొడవలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని తోసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎంపీ సారంగి తలకు గాయమైన వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే, ఈ ఆరోపణలపై రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. నిజానికి బీజేపీ ఎంపీల బృందమే తమను తరిమికొట్టి, బెదిరింపులకు పాల్పడిందని, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గేను కూడా బెదరించారని రాహుల్ గాంధీ విలేకరులతో అన్నారు. ‘‘నేను లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాను. కానీ బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించాను. వారు నన్ను దూరంగా నెట్టివేసి, బెదిరించారు. తమకు పార్లమెంట్‌లోకి వెళ్లే హక్కు ఉంది’’ అని ఆయన అన్నారు.
తనపైకి ఓ వ్యక్తిని రాహుల్ గాంధీ నెట్టాడని, అతను తనపై పడటంతో తలకు గాయమైనట్లు బీజేపీం ఎంపీ సారంగి చెప్పారు. ‘‘నాపై పడిన ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారు. ఆ తర్వాత నేను కింద పడిపోయాను. నేను మెట్ల వద్ద నిలబడి ఉండగా రాహుల్ గాంధీ వచ్చిన నాపైకి ఎంపీని తోసేశాడు.’’ అని ఆయన చెప్పారు. గాయపడిన ఎంపీని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
#WATCH | Delhi | BJP MP Pratap Chandra Sarangi says, "Rahul Gandhi pushed an MP who fell on me after which I fell down…I was standing near the stairs when Rahul Gandhi came and pushed an MP who then fell on me…" pic.twitter.com/xhn2XOvYt4
— ANI (@ANI) December 19, 2024
#WATCH | Lok Sabha LoP Rahul Gandhi says, "This might be on your camera. I was trying to go inside through the Parliament entrance, BJP MPs were trying to stop me, push me and threaten me. So this happened…Yes, this has happened (Mallikarjun Kharge being pushed). But we do not… https://t.co/q1RSr2BWqu pic.twitter.com/ZKDWbIY6D6
— ANI (@ANI) December 19, 2024
తాజావార్తలు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్‌ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
-
Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!