Congress: రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇతన ప్రతిపక్షాలు బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీకి అల్టిమేటం జారీ చేశారు. అయితే, తన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ తప్పుపట్టిస్తోందని అమిత్ షా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Bombay High Court: రాజకీయ పార్టీలకు కోర్టు ఆదేశాలపై గౌరవం లేదు.. అక్రమ హోర్డింగులపై ఫైర్..
ఇదిలా ఉంటే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లను తమ హ్యాండిల్స్‌లో షేర్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ బుధవారం నోటీసులు ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు పోస్ట్ చేసిన కంటెంట్‌ని తీసివేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ((MHA) యొక్క సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుండి నోటీసులు అందుకున్నట్లు ఎక్స్ తెలిపింది. ఇది భారతదేశ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని సదరు నోటీసులు పేర్కొన్నట్లు ఎక్స్ కాంగ్రెస్ నేతలకు ఒక కమ్యూనికేషన్‌లో తెలియజేసింది. అయితే, పంపిన నోటీసులపై ఎక్స్ లేదా హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నుంచి ఎలాంటి నిర్ధారణ లేదు.
రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రతిపక్షాలు అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది, ఇంతలా దేవుడు పేరు తలుచుకుంటే వారికి స్వర్గంలో చోటు లభించి ఉండేది అని అన్నారు. ఈ వ్యాఖ్యలే మొత్తం వివాదానికి కారణమైంది. అయితే, ఈ స్పీచ్‌లోని కొంత భాగాన్ని కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ నేతలు షేర్ చేసుకున్నారు.