BJP: రాహుల్ గాంధీ ఇందుకే కుంగ్‌ఫూ నేర్చుకున్నారా..? బీజేపీ ఎంపీలపై దాడిపై పోలీస్ కేసు..
- రాహుల్ గాంధీ ఇందుకే కుంగ్ ఫూ నేర్చుకున్నారా..?
- బీజేపీ ఎంపీల దాడిపై కమలం నేతలు ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ‘‘ అంబేద్కర్ ’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్‌ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.
గురువారం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ఎంపీలైన ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టడంతో వారు గాయపడ్డారు. సారంగికి తలకు గాయమైంది. ఆయనను అధికారులు ఆస్పత్రికి తరలించి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. పార్లమెంట్ ప్రధాన ద్వారమైన మకర్ దావర్ వద్ద ఈ ఘటన జరిగింది. సారంగిపైకి రాహుల్ గాంధీ ఒక వ్యక్తి నెట్టడంతో ఆయన మెట్లపై పడిపోయారు. ఈ వ్యవహారం మొత్తం పెద్ద వివాదంగా మారింది.
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
Read Also: Congress: అమిత్ షా ‘‘అంబేద్కర్’’ కామెంట్స్ ఎడిట్.. కాంగ్రెస్ నేతలకు ‘ఎక్స్’ నోటీసులు..
బీజేపీ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరన్ రిజిజు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో ఎలా బలప్రయోగం చేయగలడు..? ఇతర ఎంపీలపై భౌతికంగా దాడి చేసే అధికారం ఏ చట్ట ప్రకారం రాహుల్ గాంధీకి ఉంది..? అని రిజిజు ప్రశ్నించారు. జపనీస్ మార్షల్ ఆర్ట్‌లో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్న రాహుల్ గాంధీపై ఆయన సెటైర్లు పేల్చారు. ‘‘మీరు ఇతర ఎంపీలపై దాడి చేయడానికి కరాటే, కుంగ్ ఫూ నేర్చుకున్నారా..? ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కుస్తీకి వేదిక కాదు, ఇద్దరు ఎంపీలు గాయపడి ఆస్పత్రిలో ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ గాయపడిన ఎంపీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై సారంగి, రాజ్‌పుత్‌లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనపై బీజేపీ రాహుల్ గాంధీపై పోలీస్ కేసు పెట్టింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘నేను పార్లమెంట్‌కి రాకుండా బీజేపీ ఎంపీల గుంపు అడ్డుకుందని, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని తోసేస్తున్నారు. ఇది ఘర్షణకు కారణమైంది. బీజేపీ ఎంపీలు తనను నెట్టివేసి బెదిరించారు.’’ అని చెప్పారు.
#WATCH | Union Minister Kiren Rijiju says, "Makar Dwar is the main entry gate of the Members of Parliament to both Lok Sabha and Rajya Sabha. The Congress and their other MPs kept on standing in that particular location and they have been showing placards and sloganeering for the… pic.twitter.com/gwvFmGGm2M
— ANI (@ANI) December 19, 2024
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!