BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందట అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సుఖ్బీర్ సింగ్ దలాల్ శనివారం బీజేపీలో చేరారు. ముండ్కా మాజీ ఎమ్మెల్యే అయిన దలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా, ఆశిసూద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆరు సార్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సర్దార్ బల్బీర్ సింగ్ కూడా కాషాయ పార్టీలో చేరారు. సచ్‌దేవా ఆయనను ఢిల్లీ […]
Maha Kumbh Mela 2025: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ ‘మహా కుంభమేళా’కు సిద్ధమవుతోంది. కోట్లాది మంది భక్తులు వచ్చే ఈ అపురూప కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జరగబోయే ఈ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెబుతారు. హిందూ మతంలో అతపెద్ద పండగల్లో కుంభమేళా ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ గొప్ప కార్యక్రమం […]
Parliament 'assault' case: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాహుల్ గాంధీ తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టివేయడంతో వారు గాయపడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేర్పించారు. సభలోకి వచ్చే ప్రయత్నంలో రాహుల్ గాంధీ తమను నెట్టారని బీజేపీ చెబుతోంది.
Ujjain: విషాదకర సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆమె ధరించిన దుపట్టానే మెడకు ఉరితాడులా బిగుసుకుపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలోని ఫుడ్ సెంటర్లో చోటు చేసుకుంది. బంగాళాదుంపల తొక్క తీసే యంత్రంలో దుపట్టా చిక్కుకుపోయింది. దీంతో మెడకకు బిగుసుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ శనివారం మరణించినట్లు అధికారులు తెలిపారు.
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌లో ‘‘ మన చమురు, గ్యాస్‌ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా అమెరికా వారితో విపరీతమైన లోటును భర్తీ చేయాలని యూరోపయిన్ యూనియన్‌కి చెప్పాను. లేకపోతే అన్ని విధాలుగా టారిఫ్‌లు ఉంటాయి’’ అని హెచ్చరించారు.
Elon Musk: క్రిస్మస్ పండగకి కొన్ని రోజుల ముందు జర్మనీలో ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. జర్మనీలోని మాగ్డేబర్గ్ నగరంలో విందు చేస్తున్న గుంపుపై కారు దూసుకెళ్లిన ఘటనపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. జర్మనీ ఛాన్సరల్ ఓలాఫ్ స్కోల్జ్‌ని దారుణంగా దూషించారు. ‘‘చేతకాని దద్దమ్మ’’ అంటూ స్కోల్జ్‌పై మస్క్ విరుచుకుపడ్డాడు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని శుక్రవారం మస్క్ డిమాండ్ చేశారు.
Nitish Kumar: 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతాయని ఎన్డీయే శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్‌ని తమ నాయకుడిగా ప్రకటించే అవకాశం లేదని వస్తున్న ఊహాగానాలపై ఈ రోజు స్పష్టత వచ్చింది. బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు సమావేశమయ్యారు.
India Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం విర్రవీగుతోంది. భారత్‌ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న మిగతా నేతలు భారత్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మహ్ఫజ్ ఆలం ఫేస్బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విజయ్ దినోత్సవం రోజున ఆలం ఈ పోస్ట్ చేశాడు. ఇదే కాకుండా, భారత్‌లోని పలు ప్రాంతాలను బంగ్లాదేశ్‌లో విలీనం చేసుకుంటామని బెదిరిస్తూ కామెంట్స్ చేశాడు.
Kerala High Court: ఆసుపత్రులు "ఆధునిక సమాజంలోని దేవాలయాలు" అని, కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా విధ్వంసం నుండి రక్షించబడాలని కేరళ హైకోర్టు నొక్కి చెప్పింది. డిసెంబర్ 07న కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఆయుర్వేద ఆస్పత్రి ధ్వంసం చేసి, రూ. 10,000 నష్టానికి కారణమైన కేసులో నిందితుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
Violence against Hindus: 2024లో బంగ్లాదేశ్‌లో హిందువులపై 2200 హింసాత్మక దాడులు జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు ఎక్కువ అయినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇదే సమయలో పాకిస్తాన్లో హిందువులపై 112 దాడులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.