ఇదిలా ఉంటే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన డీఎంకే కార్గవర్గ సమావేశంలో 12 తీర్మానాలను ఆమోదించింది. పార్లమెంట్లో బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తొలి తీర్మానం చేశారు. ఈ తీర్మానంలో అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. ‘‘ప్రజాస్వామ్య దేవాలయంలో దేశ హోంమంత్రి ఇంత అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటు.
Gujarat: అహ్మదాబాద్‌లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు రూపన్ రావు(44) ఇంటర్నెట్లో బాంబులు, నాటు తుపాకులను తయారుచేయడం నేర్చుకున్నట్లు తేలింది.
Zia Ur Rehman Barq: విద్యుత్ చౌర్యం కేసులో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌పై యూపీ విద్యుత్ శాఖ కేసు నమోదు చేశారు. నవంబర్ నెలలో సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో అధికారులపై దాడులు చేసిన ఘటనలో రెహ్మాన్ బార్క్ నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్, ఆ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తులపై కేసులు పెడుతోంది.
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనే కాకుండా హిందీ ల్యాండ్‌లో సత్తా చాటింది. అయితే, ఇలాంటి సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఓ గ్యాంగ్ స్టర్‌ని పోలీసుల చాకచక్యంగా పట్టుకున్నారు. నాగ్‌పూర్‌లో సినిమా చూస్తున్న సమయంలో డ్రగ్స్ స్మగ్లింగ్, హత్యలతో సంబంధం ఉన్న పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ని అరెస్ట్ చేశారు.
Sambhal: ఇటీవల మసీదు సర్వే సమయంలో అల్లర్లు జరగడంతో ఒక్కసారి ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభాల్ నగరం వార్తల్లోకి వచ్చింది. ఈ అల్లర్ల తరువాత జరిగిన పరిణామాల్లో సంభాల్‌లో అనేక పురాతన హిందూ దేవాలయాలు, బావులు బయటపడ్డాయి. తాజాగా శనివారం సర్వే చేస్తుందడగా సంభాల్‌లోని లక్ష్మణ్ గంజ్ ప్రాంతంలో ‘‘మెట్ల బావి’’ వెలుగులోకి వచ్చింది. 1857 తిరుగుబాటు కాలం నాటి 250 అడుగుల లోతున్న మెట్ల బావిని కనుగొన్నారు.
Pakistan: పాకిస్తాన్ సైన్యంపై పాక్ తాలిబన్లు ఘోరమైన దాడి చేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్‌పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట మెరుపు దాడి చేశారు. మొత్తం 30 మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఆర్మీ ఔట్ పోస్టు మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు దాడి చేశారని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.
Ambedkar row: రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘‘అంబేద్కర్’’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే శనివారం అమిత్ షాపై పదునైన విమర్శలు చేశారు. ఆయనను ‘‘పిచ్చి కుక్క’’ కరిచిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రతీరోజు అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు హిందువులు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. హిందువుల ఆస్తులు, దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారాలు ప్రతీదాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నాక, ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్కడి ప్రభుత్వం మతోన్మాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. Read Also: PM Modi: కువైట్.. మినీ ఇండియాలా ఉంది.. హలా […]
Geyser: ఇటీవల కాలంలో గీజర్, వాటర్ హీటర్ ప్రమాదాల వల్ల పలువురు మరణించారు. చాలా సందర్భాల్లో గాయాలకు గురవుతున్నారు. బాత్రూంలో గీజర్లు పేలిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. శీతాకాలం రావడంతో గీజర్లు, వాటర్ హీటర్ల వాడకం పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో గీజర్లు పేలుడు ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు వాటర్ హీటర్ల షాక్‌ల వలన మరణాలు సంభవిస్తున్నాయి.
YouTube: యూట్యూబ్ తప్పుడు "థంబ్‌నెయిల్స్", "టైటిల్స్"పై చర్యలకు తీసుకునేందుకు సిద్ధమైంది. వినియోగదారుల్ని మోసగించే విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించేందుకు కొత్త పాలసీని తీసుకురాబోతోంది. చాలా సందర్భాల్లో యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఉండే ‘‘క్లిక్‌బైట్’’ వీడియోలపై కఠినంగా వ్యవహరించనుంది.