Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఒక జిమ్ ట్రైన్ RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా నటిస్తూ.. భారత సంతతికి చెందిన కెనడియన్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై జిమ్ ట్రైనర్‌పై పోలీసులు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ లైంగిక దోపిడిలో నిందితడి స్నేహితుడు కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సికంద్రా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ […]
Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు.
Avadh Ojha: ఐఏఎస్, ఐపీఎస్ వంటి యూపీఎస్సీ కోచింగ్‌కి పేరు తెచ్చుకున్న ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. తాజాగా ఆయన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్‌ని దేవుడితో పోల్చారు. ఒక ఇంటర్వ్యూలో ఓజా ఈ వ్యాఖ్యలు చేశారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వరసగా అభియోగాలు మోపుతోంది. ఇప్పటికే ఆగస్టులో చెలరేగిన విద్యార్థుల అల్లర్లలో మానత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, పలువురు మరణాలకు కారణమైందనే నేరం ఆమెపై మోపారు.
Maharashtra: తల్లి మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలుడు తన పుట్టినరోజు కానుకగా మొబైల్ ఫోన్ కొనివ్వాలని కోరగా, తల్లి నిరాకరించింది. దీంతో పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.
Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, వీటి తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల ఎన్నికలతో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇవి ముగిసిన కొన్ని రోజులకే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఇలా గత ఆరు నెలల నుంచి ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ, తన కుటుంబానికి సమాయాన్ని కేటాయించారు. కుటుంబంతో రిఫ్రెష్ అవుతున్నారు.
DK Shivakumar: రాబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో దేశాన్ని భవిష్యత్ కోసం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆదివారం తెలిపారు.
2025 Honda Activa: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్తగా 125 సీసీ హోండా యాక్టివాను తీసుకువచ్చింది. అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్‌తో పాటు మరికొన్ని అత్యాధునిక ఫీచర్లు అందిస్తోంది. రూ. 94,422 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో యాక్టివాను ఇంట్రడ్యూస్ చేశారు. లేటెస్ట్ ‘‘ఉద్గార నిబంధనలకు’’ అనుగుణంగా యాక్టివా ఉండనుంది. 6 కలర్స్‌తో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లతో వస్తోంది.
Chennai: కొన్ని సంస్థలు ఉద్యోగుల కష్టాలను గుర్తిస్తాయి. మరికొన్ని సంస్థలు మాత్రం జీతాలు తీసుకునే యంత్రాల్లాగే ఉద్యోగులు ట్రీట్ చేస్తుంటాయి. ఇలా ఉద్యోగుల పనితనాన్ని గుర్తించే సంస్థలు తమ ఉద్యోగుల కోసం గిఫ్ట్‌లు ఇచ్చిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల కృషిని గుర్తించి వారికి కార్లు, బైకులు అందించింది.