దావోస్ వేదికగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటైంది. ట్రంప్ అధ్యక్షతన ఈ శాంతి మండలి ఏర్పాటైంది. ఈ బోర్డులోకి 50 దేశాలను ఆహ్వానించగా.. 35 దేశాలు చేరాయి. ఇక దావోస్‌లో సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: US-Canada: అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు.. బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రంప్ ఎడమ వైపు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూర్చున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు షరీఫ్ షేక్‌హాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ చెవిలో గుసగుసలాడారు. ఈ క్రమంలో అసిమ్ మునీర్ ఎక్కడా? అని ట్రంప్ అడిగినట్లు ఉన్నారు. వెంటనే స్టేజ్ ముందు కూర్చున్న అసిమ్ మునీర్‌ను ఫరీఫ్ చూపించారు. ట్రంప్ కూడా అసిమ్ మునీర్ చూసి.. వేలు చూపించి గుర్తుపట్టారు. ఈ సందర్భంగా షరీఫ్-ట్రంప్ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాకిస్థాన్‌తో ట్రంప్‌కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోంది.
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌తో ట్రంప్ సంబంధాలు పెంచుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను వైట్‌హౌస్‌కు పిలిచి ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. అనంతరం ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లినప్పుడు కూడా మరోసారి షరీఫ్, మునీర్ ట్రంప్‌ను కలిశారు.
గాజాలో పరిపాలన కోసం ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటు చేశారు. ఈ శాంతి మండలిలో చేరాలని భారత్ సహా 50 దేశాలను పిలిచారు. అయితే తొలుత ఇజ్రాయెల్ వ్యతిరేకించినా.. అనంతరం అంగీకారం తెలిపారు. ఇక ముస్లిం దేశాలు స్వాగతించాయి. ఇక యూరోపియన్ దేశాలైతే తిరస్కరించాయి. ఇదిలా ఉంటే కెనడాను ఆహ్వానించి తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ బోర్డులో భారత్ చేరలేదు. ఇక ఈ బోర్డులో పాకిస్థాన్ చేరడంతో సోషల్ మీడియాలో పంచ్‌లు పేలుతున్నాయి.
Showbaz pointing at Asim Munir in the audience to show Trump where is the boss sitting pic.twitter.com/s9HlvoY4e7
— Gabbar (@GabbbarSingh) January 22, 2026