PM Modi: తన ఫోటో పట్టుకున్న బాలుడిని గమనించిన ప్రధాని మోడీ.. ఏం చేశారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోడీ కేరళలో ర్యాలీ నిర్వహించారు. మోడీ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే.. మోడీ ఈ సభలో మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన ప్రసంగం మధ్యలోనే జనాల్లో ఉన్న ఓ బాలుడు ప్రధాని దృష్టిని ఆకర్షించాడు. చేతిలో ప్రధాని ఫొటో పట్టుకుని చాలాసేపు అలాగే నిలబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే తన ప్రసంగాన్ని ఆపిన ప్రధాని ఆ బాలుడిని వేదికపై నుంచి పలకరించారు. ఇది చూసిన సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది.
READ MORE: Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించి చివరికీ..
Also Read
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
ఆ బాలుడిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. “చాలాసేపుగా ఈ చిన్నబ్బాయి చేతిలో ఫొటో పట్టుకుని నిలబడి ఉన్నాడు. నువ్వు అలసిపోయి ఉంటావు. ఆ ఫొటో నాకు ఇవ్వు. వెనుక నీ ఇంటి చిరునామా రాయు. నేను నీకు లేఖ రాస్తాను,” అని చెప్పారు. ప్రధాని మాటలకు అక్కడున్నవారు ఆనందంతో కేరింతలు కొట్టారు. అంతేకాదు.. ఆ ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని ఎస్పీజీ సిబ్బందికి సూచించారు. “ఇది ఆ చిన్నారి ప్రేమకు, ఆశీర్వాదాలకు గుర్తు. చాలా జాగ్రత్తగా తీసుకోండి,” అని మోడీ అన్నారు. ఈ మాటలు అక్కడున్నవారిని మరింత కదిలించాయి. ప్రసంగం కొనసాగుతుండగానే మరో విషయం కూడా ప్రధాని గమనించారు. జనాల్లో ఓ మహిళ పెద్ద పుస్తకం పట్టుకుని తనకు ఇవ్వాలని చూస్తున్నట్టు గుర్తించారు. “ఆ మహిళ కూడా నాకు ఏదో ఇవ్వాలనుకుంటోంది. పెద్ద పుస్తకం చేసి తీసుకొచ్చింది,” అంటూ చిరునవ్వుతో చెప్పారు. ఈ చిన్న సంఘటనలు ర్యాలీ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి.
READ MORE: Ajith Kumar : రెండేళ్లకో సినిమాతో కనిపిస్తున్న అజిత్.. సినిమాలపై ఎందుకు కాన్సన్‌ట్రేషన్ చేయట్లేదు
తాజావార్తలు
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
-
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!