BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్‌కి షాక్..బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్‌కి షాక్..
- బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందట అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సుఖ్‌బీర్ సింగ్ దలాల్ శనివారం బీజేపీలో చేరారు. ముండ్కా మాజీ ఎమ్మెల్యే అయిన దలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా, ఆశిసూద్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఆరు సార్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సర్దార్ బల్బీర్ సింగ్ కూడా కాషాయ పార్టీలో చేరారు. సచ్‌దేవా ఆయనను ఢిల్లీ బీజేపీ కార్యదర్శిగా నియమించారు.తాను ఎమ్మెల్యేగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించానని, ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఇటుక కూడా వేయలేదని దలాల్ ఆరోపించారు. ఢిల్లీ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూనే, ఆప్ తన అవినీతి నిరోధక హామీలకు దూరంగా ఉందని ఆరోపించారు.
Also Read
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
Read Also: Jaya Bachchan: లోక్‌సభ ఘటనపై జయా బచ్చన్ హాట్ కామెంట్స్.. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని వ్యాఖ్య
ఆప్ క్రీడా యూనివర్సిటీ గురించి తప్పుడు హామీలు ఇచ్చిందని సచ్‌దేవా విమర్శించారు. కాగితంపై నియామకాలు జరిగాయని, నిధులు పంపిణీ చేయబడ్డాయని, కానీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదని చెప్పారు. కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం ఏ ప్రాజెక్టు ప్రారంభించినా, తన హయాంలోనే పూర్తి చేసేలా చూస్తోందని చెప్పారు.
ఢిల్లీలోని పంజాబీ, గ్రామీణ వర్గాల్లో బల్బీర్ సింగ్, సుఖ్‌బీర్ దలాల్‌కి మంచి పేరుందని సచ్‌దేవా ప్రశంసించారు. కేంద్రమంత్రి మల్హోత్రా మాట్లాడుతూ.. ఆప్ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ఒకప్పుడు పార్టీ అవినీతికి వ్యతిరేకమని చెప్పేవారని, ఇప్పుడు ప్రజలు ఆ పార్టీని వదిలేస్తున్నారని చెప్పారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేశారని, అందుకు ఆప్ నుంచి పలువురు నేతలు బయటకు వస్తున్నారని చెప్పారు. 70 మంది సభ్యులు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!