Nitish Kumar: నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలు..క్లారిటీ ఇచ్చిన ఎన్డీయే..
- 2025 బీహార్ ఎన్నికలు నితీష్ కుమార్ నేతృత్వంలోనే..
- ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చిన ఎన్డీయే నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: 2025లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోనే జరుగుతాయని ఎన్డీయే శుక్రవారం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో నితీష్ కుమార్‌ని తమ నాయకుడిగా ప్రకటించే అవకాశం లేదని వస్తున్న ఊహాగానాలపై ఈ రోజు స్పష్టత వచ్చింది. బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజు సమావేశమయ్యారు. అట్టడుగు స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం చేయడానికి ఈ సమావేశం జరిగింది. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం చాలా కాలంగా కొనసాగుతోంది, దీని నుంచి వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని అన్నారు.
Read Also: Medchal: జల్సాలకి అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్.. ఇద్దరు అరెస్ట్
Also Read
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
ఇటీవల మహారాష్ట్రలో ఘన విజయం సాధించినట్లే బీహార్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్డీయే ఎన్నికలకు వెళ్తుందా..? అని ఓ వార్త సంస్థ ప్రశ్నించిన నేపథ్యంలో అమిత్ షా మాట్లాడుతూ.. “మేము కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటాము. మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తాము” అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్యల నితీష్ కుమార్‌ని ఈసారి ఎన్డీయే నేతగా ప్రొజెక్ట్ చేయరనే ఊహాగానాలకు దారి తీసింది. బీహార్‌లో రెండు దశాబ్ధాలుగా ఎన్డీయేకి నితీష్ కుమార్ సారధ్యం వహిస్తున్నారు. మరోవైపు బీహార్ బీజేపీ చీఫ్ జైశ్వాల్ తీరుగానే LJP (RV) రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీ మాట్లాడారు. నితీష్ కుమార్ నాయకత్వంలోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే పోటీ చేస్తుందని చెప్పారు. జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాహా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!