CBI: మహిళ, ఆమె ఇద్దరు కవల పిల్లలను హత్య చేసిన నేరంలో నేరస్తులు 19 ఏళ్ల తర్వాత దొరికారు. వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది. పుదుచ్చేరిలో అరెస్ట్ చేసి జ్యుడిషియన్ కస్టడీకి తీసుకున్నారు. 2006లో కేరళలో ఒక మహిళ, ఆమె నవజాత కవల కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. నిందితులు 19 ఏళ్లుగా పరారీలో ఉన్నారు.
Atul Subhash Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసులో కీలక పరిణామం జరిగింది. సుభాష్ ఆత్మహత్యకు కారణమైన భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాకు బెయిల్ లభించింది. ఈ కేసులో బెయిల్ కోసం బెంగళూర్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తమ బెయిల్ పిటిషన్‌ని పరిష్కరించేలా సెషన్ కోర్టుని ఆశ్రయించాలని వీరు గతంలో కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు.
Instagram Love: ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలిసీతెలియని వయసులో ప్రేమ, కామం కారణంగా యువత చెడుదోవ పడుతోంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల్ని ఎదురించడం, ప్రేమించిన వారి కోసం వారిని చంపిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియా పరిచయాలు లవ్ ఎఫైర్లకు కారణమవుతున్నాయి. Read Also: Vikarabad: పావురాలతో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు.. ఇదిలా ఉంటే, గుజరాత్లో 10 ఏళ్ల బాలిక 16 […]
6th-generation fighter Jets: చైనా ఇటీవల రెండు 6వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లను పరీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ పరిణామం పొరుగు దేశమైన భారత్‌కి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం భారత్ వద్ద కనీసం 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు కూడా లేదు. ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటల్ జెట్లు 4.5వ జనరేషన్‌కి చెందినవి. చైనా వద్ద నుంచి పాకిస్తాన్ 5వ జనరేషన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయబోతుందని వార్తలు ఇటీవల వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో…
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయ వాతావరణం మారిపోయింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, మరోసారి అధికారం చేపట్టాలని ఆప్, సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి.
Surat: సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాన్ శనివారం తన సర్వీస్ వెపన్తో కాల్చుకుని ఆత్మహత్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 2.10 గంటలకు విమానాశ్రయాలోని వాష్‌రూంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పై విపక్ష నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ అంటేనే కోపంతో రగిలిపోయే శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఇటీవల ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. గడ్చిరోలి జిల్లాలో సీఎం సమక్షంలో 11 మంది నక్సలైట్లు లొంగిపోయారు. శివసేన పత్రిక సామ్నాలో ఫడ్నవీస్ కృషిని పొగిడారు.
HMPV Virus: ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్(HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్గా కొట్టిపారేస్తోంది.
Pani Puri: ‘‘పానీపూరీ’’ మనదేశంలో ప్రసిద్ధిమైన స్ట్రీట్‌ఫుడ్. పిల్లల నుంచి పెద్దల దాకా సాయంత్రం వేళల్లో పానీపూరీ బండ్లు కలకలలాడుతుంటాయి. ఇంత క్రేజ్ ఉన్న ఈ పానీపూరీ వ్యాపారం ద్వారా విక్రేతలు లక్షల్లో సంపాదిస్తున్నారు. నిజానికి పానీపూరీ లేదా గోల్గప్పా పేరు ఏదైనా కానీ, ఈ వ్యాపారం ఇతర ఉద్యోగాల కన్నా చాలా బెటర్ అంటూ సోషల్ మీడియాలో రీల్స్, మీమ్స్ తెగవచ్చాయి.
Dating Apps fraud: ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి పగటిపూట ఓ ప్రైవేట్ కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేస్తాడు. రాత్రి వేళల్లో మాత్రం అమెరికాకు చెందిన ఓ మోడల్‌గా మారుతాడు. ఈ కేటుగాడు తాను అమెరికాకు చెందిన మోడల్ అని, ఢిల్లీలో పర్యటిస్తున్నానని ఫోజ్ కొట్టి ఏకంగా 700 మంది మహిళల్ని మోసం చేశాడు. మహిళల్ని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న సదరు వ్యక్తిని శుక్రవారం తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.