Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయ వాతావరణం మారిపోయింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, మరోసారి అధికారం చేపట్టాలని ఆప్, సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు పంజాబ్‌కి చెందిన మహిళలు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆప్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని చెబుతూ మహిళలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తంగా మారింది.
Read Also: Record in Bookings: 2024లో ఈ కారు కొత్త రికార్డు సృష్టించింది.. గంటలో 1.7లక్షల బుకింగ్స్!
పంజాబ్‌లో ప్రతీ మహిళకు రూ.1000 అందచేస్తామని హామీ ఇచ్చిన ఆప్ ప్రభుత్వం, దానిని నెరవేర్చలేదని నిరసనకారులు ఆరోపించారు. నాలుగోసారి వరసగా మళ్లీ గెలిస్తే తాము మహిళకు రూ. 2100 ఇస్తామని ఆప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిరసనలు జరగడం గమనార్హం. తమ సమస్యల్ని లేవనెత్తడానికి అమృత్‌సర్ నుంచి వచ్చినట్లు మహిళలు చెప్పారు. మాలాగే ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దని నిరసనకారులు అన్నారు. అయితే, ఈ నిరసనపై ఆప్ ఎదురుదాడికి దిగింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నిరసన తెలుపుతున్న వారు కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారని అన్నారు. ఈ రెండు పార్టీలు కూడా అనధికారికంగా పొత్తు ప్రకటించాయని దుయ్యబట్టారు.