Supreme Court: చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని కూడా లాక్కోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు’’ అని చెప్పింది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం -1978 కారణంగా ఆస్తిపై హక్కు ప్రాథమిక హక్కుగా తొలగించారు,
Sanjay Raut: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అజిత్ పవార్, శరద్ పవార్ కలిపోతారనే వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే, బీజేపీ సర్కార్ అంటేనే విరుచుకుపడే శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డారు. ఆప్ అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నివాసం కోసం అరవింద్ కేజ్రీవాల్ ‘‘శీష్ మహల్’’ని విలాసవంతంగా నిర్మించారు.
Amit Shah: కాశ్మీర్‌కి హిందూమతంలో గౌరవనీయులైన ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. ఢిల్లీలో ‘‘జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ త్రూ ది ఏజెస్’’ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
Adani bribery case: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలుపుతూ న్యూయార్క్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులను ఉమ్మడి విచారణలో కలిపి విచారించాలని కోర్టు తీర్పు చెప్పింది.
China: చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేలా కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టే లోపే వాణిజ్య యుద్ధానికి చైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్‌కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్‌కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది.
Maharashtra: మహారాష్ట్రలో ఓ విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడని డిక్లేర్ చేయబడిన వ్యక్తి, సజీవంగా ఉన్నట్లు తెలిసింది. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లాలోని కసాబా బవాడ నివాసి అయిన 65 ఏళ్ల పాండురంగ్ ఉల్పేకి గుండెపోటు వచ్చింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. Read Also: Cafe Owner Suicide: ‘‘భార్య, అత్తమామలు తీవ్రంగా హింసించారు’’.. ఆత్మహత్యకు ముందు పునీత్ వీడియో.. ఇక చేసేందేం లేక ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ని మాట్లాడారు. […]
Cafe Owner Suicide: ఢిల్లీ కేఫ్ ఓనర్ 40 ఏళ్ల పునీత్ ఖురానా ఆత్మహత్య సంచలనంగా మారింది. ఇటీవల బెంగళూర్‌లో ఆత్మహత్ చేసుకున్న అతుల్ సుభాష్ లాగే పునీత్ భార్య, అతడి కుటుంబం వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన సూసైడ్ చేసుకునేందుకు ముందు రికార్డ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. భార్య మాణికా పహ్వా, అత్తమామలపై సంచలన ఆరోపణలు చేశారు. వీరంతా కలిసి తనను మానసికంగా హింసించారని, అసమంజసమైన డిమాండ్లతో తనను ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు.
Online Love: ఉత్తర్ ప్రదేశ్ అలీఘఢ్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల బాదల్ బాబు అనే వ్యక్తి తన ప్రియురాలిని కలిసేందుకు పాకిస్తాన్ వెళ్లిన వార్త వైరల్ అయింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా పాకిస్తాన్ సరిహద్దును దాటి దాయాది దేశంలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అక్కడి పోలీసులు బాబుని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌కి చెందిన సనా రాణి(21)కి బాదల్ బాబులో ఆన్లైన్ స్నేహం కుదిరింది. తన ఫేస్బుక్ ఫ్రెండ్‌ని కలవడానికి సరిహద్దు దాటి, పాకిస్తాన్ పంజాబ్ […]