Atul Subhash Suicide Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య నిఖితా సింఘానియా, అత్తమామలు పెట్టే వేధింపులను 24 పేజీల్లో వివరించాడు. చనిపోయే ముందు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేశాడు. అందులో తన ఆవేదన, తాను ఎదుర్కొన్న తప్పుడు కేసులను గురించి చెప్పాడు
HMPV Virus: చైనాలో ప్రారంభమైన కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పొరుగుదేశాలు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇండియాలో HMPV వైరస్ కేసుల సంఖ్య 6కి చేరింది. ఈ ఒక్క రోజే ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కోల్‌కతాలో 5 నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. చెన్నైలో మరో ఇద్దరు పిల్లలకు కూడా ఈ […]
HMPV Virus: ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కలవరపెడుతోంది. కోవిడ్-19 వ్యాధికి 5 ఏళ్లు ఇటీవల పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా వైరస్ చేదు సమయాన్ని మరిచిపోతున్నారు. ఇంతలో HMPV వైరస్ రావడం ప్రజల్ని భయపెడుతోంది.
HMPV Virus: చైనాలో ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, భారత్‌లో కూడా మూడు కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ భయాల మధ్య టాప్ మెడికల్ బాడీ-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఇప్పటికే భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ‘‘సర్క్యులేషన్’’లో ఉందని సోమవారం హెచ్చరించింది.
Borewell Incident: రాజస్థాన్‌లో ఇటీవల బోరుబావిలో పడి మూడేళ్ల బాలిక చేతన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాలిక సురక్షితంగా తిరిగి రావాలని అంతా కోరుకున్నారు. 10 రోజుల రెస్క్యూ తర్వాత బాలిక చనిపోయింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన మరవక ముందే మరో బోరుబావి సంఘటన చోటు చేసుకుంది.
India On Pak: ఇటీవల తాలిబన్లు టార్గెట్‌గా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లోని ఆప్ఘన్ పక్తికా ప్రావిన్సుపై ఈ దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులో పిల్లలు ,మహిళలు అమాయకులు 40 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు చెప్పారు. ఈ దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. సుక్మా జిల్లాలో జవాన్లను టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చారు. వాహనంలో జవాన్లు వెళ్తున్న క్రమంలో మందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి చెందారు.
Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్‌ని బెదిరించాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే ‘‘మహా కుంభమేళా’’పై దాడులు నిర్వహించి, భగ్నం చేస్తామని బెదిరింపులు జారీ చేశాడు.
Bengaluru Shocker: బెంగళూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ, ఓ టెక్కీ తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఆర్‌ఎంవీ 2వ స్టేజ్ ప్రాంతంలోని అద్దెకు ఉంటున్న సాఫ్ట్వేర్ కన్సల్టెంట్, తన కుటుంబంతో సహా శవాలుగా కనిపించారు. హత్యా-ఆత్మహత్య అనే అనుమానంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Bangladesh: భారతదేశంలో బంగ్లాదేశ్‌కి చెందిన దిగువ న్యాయవ్యవస్థ జడ్జిలకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడి యూనస్ సర్కార్ రద్దు చేసింది. ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఒక రోజు తర్వాత దానిని రద్దు చేసింది. ఈ శిక్షణా కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ అండ్ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో జరగాల్సి ఉంది. శిక్షణకు సంబంధించిన అన్ని ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంది.