BrahMos: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ నెలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. 2025 భారత గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.
MK Stalin: సింధులోయ నాగరికత, ప్రపంచంలోని అతి పురాతన నాగరికతల్లో ఒకటి. హరప్పా, మొహంజదారో వంటి ప్రణాళిక బద్ధమైన పట్టణాలకు కేంద్రంగా ఉంది. అయితే, ఇలాంటి నాగరికతకు చెందిన లిపిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే, సింధూ నాగరికత స్క్రిప్ట్‌ని విజయవంతంగా అర్థం చేసుకునే వారికి 1 మిలియన్ డాలర్లు(సుమారుగా రూ. 8.5 కోట్లు) నగదు బహుమతిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రకటించారు.
Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది యోగి సర్కార్. మరికొన్ని రోజుల్లో కుంభమేళా ప్రారంభం కాబోతోంది. అయితే, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Bombay High Court: ఒక బాలికను ఫాలో అయ్యాడనే ఒకే ఉదాహరణ అనేది ఐపీసీ సెక్షన్ 354(D) ప్రకారం ఒక బాలికను స్టాకింగ్(వెంబడించడం) చేశాడనే నేరంగా పరిగణించబడటానికి అనుగుణంగా లేదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలికకు సంబంధించిన కేసులో లైంగిక వేధింపులు, అతిక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు 19 ఏళ్ల యువకులకు సంబంధించిన పిటిషన్ల జస్టిస్ జీఏ సనప్ విచారించారు.
Israel: మొస్సాద్ - ఇజ్రాయిల్ గూఢచార సంస్థ. ప్రపంచంలోనే అత్యుత్తమ స్పై ఏజెన్సీ. 1962లో సిరియాలో మొస్సాద్ ఏజెంట్ ఎలి కోహెన్ బహిరంగంగా ఉరితీయబడ్డాడు. వ్యాపారవేత్తగా కమెల్ అమిన్ థాబెట్ పేరుతో సిరియా రాజధాని డమాస్కస్‌లోకి అడుగుపెట్టి కోహెన్, అతి తక్కువ కాలంలోనే ఆ దేశంలోని ఎలైట్ వర్గంలో ప్రముఖ వ్యక్తిగా మారాడు. దేశంలోని శక్తివంతమైన రాజకీయ నాయకులు, మిలిటరీ లీడర్లతో సంబంధాలను పెంచుకున్నాడు.
Zimbabwe: ఆఫ్రికా దేశం జింబాబ్వే కఠినమైన అడవులు, వన్యప్రాణులకు కేంద్రంగా ఉంది. ఇలాంటి అడవుల్లో ఎవరైనా తప్పిపోతే దాదాపుగా మరణమే శరణ్యం. అలాంటిది ఓ 8 ఏళ్ల బాలుడు మాత్రం అద్భుతంగా బయటపడిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తగా నిలిచింది. ఉత్తర జింబాబ్వేకి చెందిన బాలుడు కఠినమైన అడవి పరిస్థితులను ధిక్కరించి విజయం బయటపడపడ్డాడు.
Gujarat: భార్యల వేధింపులకు భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్, ఢిల్లీ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా ఘటనలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భార్యలు వేధించడంతో తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీరిద్దరు వీడియో రికార్డ్ చేసి మరణించారు. తాజాగా గుజరాత్లో ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. భార్య వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”తో 3 పులులు, ఒక చిరుత మృతి.. […]
Bird flu: మహారాష్ట్ర నాగ్‌పూర్ సమీపంలోని గోరెవాడ రెస్క్యూ సెంటర్లో మూడు పులులు, ఒక చిరుతపులి మరణించింది. బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఫ్లూ H5N1 వైరస్) సోకడంతో వన్యప్రాణులు మరణించాయి. డిసెంబర్ 2024 చివరలో ఈ మరణాలు నివేదించబడ్డాయి. దీంతో మహారాష్ట్ర అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మానవులు-వన్యప్రాణుల సంఘర్షణ సంఘటనల తర్వాత వీటిని డిసెంబర్లో చంద్రపూర్ నుంచి గోరెవాడకు తరలించారు.
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే, నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్‌గా చేస్తానని ఆదివారం కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలుపై వివాదం చెలరేగింది.
George Soros: బిలియనీర్ జార్జ్ సోరోస్‌ని ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’తో గౌరవించాలని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్ బహిరంగంగా విమర్శించారు. ‘‘బైడెన్ సోరోస్‌కి ప్రెసిడెన్షియల్ మెడల్ని ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. ఒక విడ్డూరం’’ అని మస్క్ విమర్శించారు.