Instagram Love: ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తెలిసీతెలియని వయసులో ప్రేమ, కామం కారణంగా యువత చెడుదోవ పడుతోంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల్ని ఎదురించడం, ప్రేమించిన వారి కోసం వారిని చంపిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియా పరిచయాలు లవ్ ఎఫైర్లకు కారణమవుతున్నాయి.
Read Also: Vikarabad: పావురాలతో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు..
ఇదిలా ఉంటే, గుజరాత్‌లో 10 ఏళ్ల బాలిక 16 ఏళ్ల బాలుడితో పారిపోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ కూడా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం పెంచుకున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే వీరిని సమీప గ్రామం నుంచి పోలీసులు పట్టుకున్నారు. జువైలన్ హోంకు తరలించారు. డిసెంబర్ 31న 5వ తరగతి చదువుతున్న బాలిక ధన్సురా గ్రామంలోని తన ఇంటి నుంచి కనిపంచకుండా పో యింది. గంటల తరబడి వెతికిన ప్రయోజనం లేకపోయింది. బాలికను కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఇన్‌స్టాగ్రామ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ప్రేమలో పడ్డారని పోలీసు వర్గాలు కనుగొన్నాయి. డిసెంబర్ 31న వీరిద్దరు పారిపోవాలని పథకం వేసి తమ ముగ్గురు స్నేహితుల సాయంతో పారిపోయారు.
విషయం ఏంటంటే, అమ్మాయి తండ్రికి సోషల్ మీడియా గురించి ఏమీ తెలియదు. 10 ఏళ్ల బాలిక తన తల్లి ఫఓన్ నుంచి ఇన్‌స్టా ఉపయోగించిందని, అక్కడే వేరే గ్రామంలో నివసించే బాలుడితో పరిచయం ఏర్పడిందని పోలీసులు గుర్తించారు. ఇద్దరూ తరుచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. బాలికను గుర్తించి కుటుంబ సభ్యలకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్ల బాలిక సోషల్ మీడియా వేదికగా పరిచయమైన 27 ఏళ్ల యువకుడితో పారిపోయింది. పెళ్లి చేయాలని తల్లిదండ్రుల్ని కూడా బెదిరించింది.