Surat: సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) జవాన్ శనివారం తన సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 2.10 గంటలకు విమానాశ్రయాలోని వాష్‌రూంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
Read Also: TG News: చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్‌పై ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల..
జైపూర్‌కి చెందిన 32 ఏళ్ల కిషన్ సింగ్ విధుల్లో భాగంగా సూరత్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నారు. ఎయిర్‌పోర్టులోని వాష్‌రూంలో తన సర్వీస్ రైఫిల్‌తో కడుపులో కాల్చుకున్నాడు. అతడిని వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యలు నిర్ధారించినట్లు పోలీస్ అధికారి ఎస్‌వీ భర్వాద్ తెలిపారు. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారనే విషయంపై విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.