Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పై విపక్ష నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీ అంటేనే కోపంతో రగిలిపోయే శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఇటీవల ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. గడ్చిరోలి జిల్లాలో సీఎం సమక్షంలో 11 మంది నక్సలైట్లు లొంగిపోయారు. శివసేన పత్రిక సామ్నాలో ఫడ్నవీస్ కృషిని పొగిడారు.
Read Also: KTR: కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్ళీ వస్తాయి..
అయితే, బీజేపీకి మళ్లీ ఉద్ధవ్ ఠాక్రే దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తల్ని మాత్రం ఆయన ఖండించారు. ప్రజలు తమకు ప్రతిపక్షంలో కూర్చోవాలని తీర్పునిచ్చారని అన్నారు. ప్రత్యర్థులు చేసిన మంచిని కూడా తాము అభినందిస్తామని అన్నారు. గడ్చిరోలి వంటి నక్సల్స్ ప్రభావిత జిల్లాను అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ఉక్కు నగరంగా తీర్చిదిద్దాలని ఫడ్నవీస్ భావిస్తే, మావోయిస్టుల నిర్మూలనకు ప్రయత్నాలు చేస్తుంటే శివసేన ఠాక్రే వర్గం దానిని స్వాగతిస్తుందని అన్నారు.
ఇదిలా ఉంటే, శరద్ పవార్ ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే కూడా దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం ఫడ్నవీస్ మాత్రమే క్రియాశీలకంగా ఉన్నట్లు కనిపిస్తోందని అన్నారు. మహాయుతి ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదని, గత నెల రోజులుగా ఫడ్నవీస్ మాత్రమే యాక్షన్ మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోందని ఆమె అన్నారు.