HMPV Virus: ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్(HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్‌గా కొట్టిపారేస్తోంది.
అంతర్జాతీయ నివేదికలు ప్రస్తుతానికి చైనాకు ట్రావెల్ ప్లాన్స్‌ని పున:పరిశీలించాలని ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆందోళనలు పరిష్కరించడానికి చూనా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ శుక్రవారం మాట్లాడుతూ.. శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్టస్థాయికి చేరుకున్నాయని చెప్పారు. చైనా పౌరులు, చైనాకు వచ్చే విదేశీయుల ఆరోగ్యం గురించి చైనా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. చైనాకు రావడం సురక్షితమని చెప్పుకొచ్చారు.
Read Also: JK: జమ్మూకాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు.. నలుగురు జవాన్లు మృతి
రద్దీగా ఉండే ఆస్పత్రులు, శ్వాసకోశ వ్యాధుల పెరుగుదల నివేదికల గురించి అడిగిన సందర్భంలో.. వ్యాధులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే తక్కువ తీవ్రతతో, తక్కువ స్థాయిలో వ్యాపించాయని ఆమె చెప్పింది. నా నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన మార్గదర్శకాలను సూచించాలని పౌరులు, పర్యాటకులను ఫాలో కావాలని ఆమె కోరారు.
గత కొన్ని రోజులుగా చైనా వ్యాప్తంగా ముఖ్యంగా ఆ దేశ ఉత్తర ప్రాంతంలో HMPV వైరల్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఇన్‌ఫ్లూఎంజా ఏ, మైకోప్లాస్మా న్యుమోనియా, కోవిడ్-19 వంటి కేసులతో అక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా పరిస్థితులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. పొరుగుదేశాలైన ఇండోనేషియా, భారత్, జపాన్ దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలని తమ పౌరులకు సూచించాయి.