CBI: మహిళ, ఆమె ఇద్దరు కవల పిల్లలను హత్య చేసిన నేరంలో నేరస్తులు 19 ఏళ్ల తర్వాత దొరికారు. వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది. పుదుచ్చేరిలో అరెస్ట్ చేసి జ్యుడిషియన్ కస్టడీకి తీసుకున్నారు. 2006లో కేరళలో ఒక మహిళ, ఆమె నవజాత కవల కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సీబీఐ శనివారం అరెస్ట్ చేసింది. నిందితులు 19 ఏళ్లుగా పరారీలో ఉన్నారు.
ఈ కేసు విషయానికి వస్తే.. ఫిబ్రవరి 10, 2006న కొల్లాంలోని ఆంచల్‌లో 24 ఏళ్ల మహిళ, ఆమె 17 రోజుల వయసు ఉన్న శిశువులను దారుణంగా హత్య చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును 2010లో కేరళ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఫిబ్రవరి 6, 2010లో కేసుని తిరిగి నమోదు చేసింది.
Read Also: Pawan Kalyan :చరణ్ ఏడేళ్ల వయసులో చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్లేవాడు!
కొల్లంకు చెందిన దివిల్ కుమార్, అతడి స్నేమితుడు రాజేష్ ఈ హత్యలకు పాల్పడినట్లు సీబీఐ విచారణ తేలింది. అప్పటి నుంచి ఇద్దరూ పరారీలో ఉన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత సీబీఐ ఎర్నాకులం చీఫ్ జ్యుడీషయల్ మేజిస్ట్రేట్ ముందు చార్జిషీట్ దాఖలు చేసింది. దివిల్, రాజేష్‌లను ప్రధాన నిందితులుగా చేస్తూ కోర్టు ప్రకటిత నేరస్తులుగా ప్రకటించింది. ఒక వ్యక్తి చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకున్న తర్వాత అవసరమైన విధంగా కోర్టుకు హాజరుకావడంలో విఫలమైన తర్వాత ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించబడుతాడు.
పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా సీబీఐ అధికారులు ఎట్టకేలకు దివిల్ కుమార్, రాజేష్‌లను పుదుచ్చేరిలో ట్రాక్ చేసి జనవరి 3న అరెస్ట్ చేసింది. దివిల్ తన పేరును విష్ణుగా, రాజేష్ తన పేరును ప్రవీణ్ కుమార్‌గా మార్చుకున్నారు. పుదుచ్చేరిలో పెళ్లి చేసుకుని ఆస్తులు కొనుగోలు చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. నిందితులిద్దరినీ శనివారం ఎర్నాకులంలోని జురిస్డిక్షనల్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.
ఎందుకు హత్య చేశారు.?
నిందితుడన దివిల్ కుమార్ బాధితురాలు రంజినితో సంబంధం ఉంది. రంజిని పుట్టిన కవలలకు దివిల్ కుమార్ తండ్రని విచారణలో తేలింది. రంజిని సాయం కోసం గతంలో కేరళ మహిళా కమిషన్‌ని ఆశ్రయించింది. 2006లో నిందితులు దివిల్, రాజేష్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారని తేలింది.
తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రంజినితో రాజేష్ పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. దివిల్ కుమార్‌కి రంజినికి పెళ్లి జరిపిస్తానని నమ్మకలికాడు. ఫిబ్రవరి 10, 2006లో రంజిని, ఆమె ఇద్దరు కవలలను వారి అద్దె ఇంట్లోనే దారుణంగా చంపేశారు. పరారీలో ఉన్న నిందితులకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ. 2 లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ ప్రకటించింది.
ఎలా పట్టుకున్నారు..?
చాలా ఏళ్లుగా కనిపించని నిందితులు విదేశాలకు పారిపోయి ఉంటారని అధికారులు భావించారు. అయితే, కేరళ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి వారి గుర్తింపుని కనుగొనే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను పోలీసులు వారి వద్ద ఉన్న ఫోటోలతో పోల్చారు. ఒక ఫోటోలో దివిల్ కుమార్ వివాహానికి హాజరైనట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులు పెళ్లిళ్లు చేసుకుని పుదుచ్చేరిలో నివసిస్తున్నట్లు గుర్తించారు.