Mahindra XEV 9E, BE 6: మహీంద్రా అండ్ మహీంద్రా తన ఫ్లాగ్షిప్ మోడల్స్ అయిన XEV 9E, BE 6 కార్లకు చాలా డిమాండ్ ఏర్పడింది. తక్కువ ధరలో టెక్ లోడెడ్, సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల కోసం చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.
Kangana Ranaut: కంగనా రనౌత్ నటించిన ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా ఈ నెల 17న విడుదల కాబోతోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాలనలో దేశవ్యాప్తంగా 21 నెలల పాటు అత్యవసర పరిస్థితి విధించించింది. ఈ ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కంగనా రనౌత్ ఇందులో ఇందిగా గాంధీగా నటిస్తున్నారు. 1975-1977లో ఇందిరాగాంధీ పాలనలో ‘‘ఎమర్జెన్సీ’’ దేశ రాజకీయాల్లో మాయని మచ్చగా మిగిలింది.
Tractor March: పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులు జనవరి 26న దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌కి పిలుపునిచ్చారు. ప్రముఖ రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో రైతుల సంఘాల నుంచి ఈ ప్రకటన వెలువడింది.
India-Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లా తాత్కిలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఆ దేశంలో భారత వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద సంస్థలు భారత్‌పై విషాన్ని వెళ్లగక్కుతున్నాయి.
Saudi Arabia: ఎడారితో నిండి ఉండే సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పవిత్ర నగరాలైన మక్కా, మదీనా, జెడ్డా నగరాలు జలాశయాలను తలపిస్తున్నాయి. రోడ్లన్ని నీటిలో నిండిపోయాయి. మక్కా నగరంలోని పలు అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లగ్జరీ కార్లు వరద నీటిలో మునిపోయాయి.
Pranab Mukherjee: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ కాంప్లెక్స్‌లోని రాష్ట్రీయ స్మృతి స్థల్లో భూమిని కేటాయించింది. తన తండ్రి స్మారకం కోసం భూమిని కేటాయించినందుకు ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
Hyundai Creta EV: హ్యుందాయ్ తన మోస్ట్ సెల్లింగ్ కార్ క్రెటాని EV అవతార్‌లో తీసుకురాబోతోంది. క్రెటా EVని జనవరి 17న భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో లాంచ్ చేయనుంది. క్రెటా EV మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి eవిటారా, మహీంద్రా BE 6, టాటా కర్వ్, ఎంజీ జెడ్ EV, టయోటా అర్బన్ క్రూయిజర్ EVలకు పోటీ ఇవ్వనుంది. తాజాగా హ్యుందాయ్ క్రెటా EV టెక్ ఫీచర్లను, సేఫ్టీ ఫీచర్లను వెల్లడించింది.
Borewell Incident: రోజుల వ్యవధిలో రెండు బోరుబావి సంఘటనలు విషాదంగా మారాయి. ఇటీవల రాజస్థాన్‌లో చేతన అనే 3 ఏళ్ల బాలిక బోరుబావిలో పడిపోయింది. 10 రోజుల రెస్క్యూ తర్వాత విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. తాజాగా, గుజరాత్ కచ్‌లో బోరుబావిలో పడిన 18 ఏళ్ల యువతి ఇంద్రా మీనా ఘటన కూడా విషాదంగా మారింది. 33 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత యువతి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ ఇతర ఏజెన్సీల ప్రయత్నం వృథాగా మారింది.
Heart Attack: ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికి వస్తుందని అనుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం ఆందోళనలు పెంచుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో యుక్త వయస్కులు గుండెపోటుకు గురై మరణించారనే వార్తలు వింటూనే ఉన్నాం. చివరకు స్కూల్ పిల్లలు మరణించడం సమస్య తీవ్రతను పెంచుతోంది.
Iran: ఇస్లామిక్ దేశం ఇరాన్ తన ప్రజలను ఉరితీసుకుంటూ వెళ్తోంది. ఆ దేశంలో నేరాలకు పాల్పడిన ఖైదీలకు విచ్చలవిడిగా మరణశిక్షలు విధించడంపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల చీఫ్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు.