Bangladesh: భారతదేశంలో బంగ్లాదేశ్‌కి చెందిన దిగువ న్యాయవ్యవస్థ జడ్జిలకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని అక్కడి యూనస్ సర్కార్ రద్దు చేసింది. ఒక రోజు శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన ఒక రోజు తర్వాత దానిని రద్దు చేసింది. ఈ శిక్షణా కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి మధ్యప్రదేశ్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ అండ్ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో జరగాల్సి ఉంది. శిక్షణకు సంబంధించిన అన్ని ఖర్చుల్ని భారత ప్రభుత్వమే భరించాల్సి ఉంది. అయితే, నోటిఫికేషన్ రద్దు చేశామని బంగ్లా న్యాయమంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. రద్దుకు సంబంధించిన వివరణ మాత్రం ఇవ్వలేదు. బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రద్దు చేసినట్లు ది డైలీ స్టార్ పత్రిక నివేదించింది.
Read Also: India weapon: ఈ భారత ఆయుధం అంటే చైనా, పాక్‌కి భయం.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్..
బంగ్లాదేశ్‌లో విద్యార్థుల హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆగస్టు 05న భారత్ వచ్చేసింది. ఆ తర్వాత ఏర్పడిన మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేఖ వైఖరిని అవలంభిస్తోంది. ముఖ్యంగా అక్కడి మైనారిటీలైన హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, గుడులపై దాడులు చేస్తున్న పట్టించుకోవడం లేదు. ఈ దాడులకు పాల్పడుతున్న జమాతే ఇస్లామీ, అన్సరుల్ బంగ్లా వంటి మతోన్మాద శక్తులు ఇప్పుడు యూనస్ సర్కారులో కీలకంగా ఉన్నారు.
ఇదే కాకుండా, భారత్ వ్యతిరేకతతో పాటు పాకిస్తాన్ అనుకూల వైఖరిని ప్రదర్శిస్తోంది బంగ్లాదేశ్. 1970 కాలం నాటి పాకిస్తాన్ ఊచకోతను మరిచిపోయి బంగ్లాదేశ్ ఆ దేశానికి దగ్గర కావాలని చూస్తోంది. గత 5 దశాబ్ధాల కాలంలో ఎప్పుడూ జరగని విధంగా కరాచీ నుంచి ఢాకాకు పాకిస్తాన్ కార్గో నౌకలు వచ్చాయి. ఇదే కాకుండా పాకిస్తాన్ సైన్యం త్వరలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ కూడా ఇవ్వబోతోంది. ఈ పరిణామాలు భారత్‌కి ఆందోళన కలిగించే విధంగా ఉంది.