Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. బీజాపూర్ జిల్లాలో జవాన్లను టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చారు. వాహనంలో జవాన్లు వెళ్తున్న క్రమంలో మందుపాతర పేల్చారు. జిల్లాలోని కుట్రు-బెద్రే రహదారిపై ఈ ఘటన జరిగింది. వాహనం డ్రైవర్‌తో సహా 9 మంది జవాన్లు, మొత్తంగా 10 మరణించారు. మరో ఐదుగురి జవాన్లకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. కూంబింగ్‌కి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు విషయాన్ని బస్తర్ ఐజీ ధ్రువీకరించారు.
Read Also: Dil Raju: ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వేల్యూ.. తెలియని భయం స్టార్ట్ అయ్యింది!
అబూజ్ మడ్ ఏరియాలో మావోయిస్టుల ఏరి వేత కోసం నాలుగు జిల్లాల నుంచి గత నాలుగు రోజులుగా కూంబింగ్ కొనసాగుతుంది. కూంబింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు పక్కా ప్లాన్‌తో ఎటాక్ చేశారు. బీజాపూర్ జిల్లాలో కుట్రూ పోలీస్ స్టేషన్ పరిధిలో అంబేలి గ్రామ సమీపంలో ఘటన జరిగింది. మృతి చెందిన వారు దంతేవాడ జిల్లాకు చెందిన డీఆర్‌జీ జవాన్లు ఉన్నారు.
గత మూడు రోజులు బట్టి బీజాపూర్ సుక్మా దంతివాడ కాంకేర్ జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు అబూజ్ మడ్ ఏరియాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన అబూజ్ మడ్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మృతి చెందారు. కాగా, ఇటీవల కాలంలో సైనికులు ఇంత పెద్ద సంఖ్యలో మృతి చెందటం ఇదే కావటంతో చత్తీస్గడ్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గత ఏడాది పోలీసుల చేతుల్లో సుమారు 260 మంది మావోయిస్టులు వరకు కూడా చనిపోయారు. ఇటీవల కాలంలో భద్రతా బలగాలపై ఇంత పెద్ద దారుణమైన ఘటన చోటు చేసుకోలేదు.