RG Kar Medical Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యపై కోల్‌కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చింది. 160 పేజీల తీర్పులో, కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్‌ను దోషిగా నిర్ధారించింది.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగి దాదాపుగా ఒకటిన్నర రోజు కావస్తోంది. అయితే, ఇప్పటికీ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడం లేదు. ఆయనపై దాడి ఘటన మొత్తం చిత్రపరిశ్రమనే షాక్‌కి గురిచేసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
Divorce case: భార్యభర్తల మధ్య విడాకుల కేసు సుప్రీంకోర్టు కీలక చర్చకు దారి తీసింది. ఈ కేసు ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించే ‘‘గోప్యత హక్కు’’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌పై ప్రశ్నల్ని లేవనెత్తింది. విడాకులు పిటిషన్ విచారిస్తున్న సుప్రీంకోర్టు, ఒక వ్యక్తి తన భార్య ప్రైవేట్ సంభాషణల్ని గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ఏళ్లుగా రికార్డ్ చేసి,
Haj yatra: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ‘‘హజ్ యాత్ర’’కు సంబంధించి భారత్-సౌదీ అరేబియాల మధ్య ‘‘హజ్ ఒప్పందం’’ కుదిరింది. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ఖరారైన తర్వాత భారతదేశంతో ‘‘పవిత్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని సౌదీ అరేబియా గురువారం తెలిపింది.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేసింది. అయితే, సకాలంలో ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించిన ఆటో డ్రైవర్ ఇప్పుడు హీరోగా మారారు. ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా హుటాహుటీన సైఫ్‌ని ఆస్పత్రికి తరలించడంలో సాయం చేశాడు. ఈ సంఘటన గురించి ఆయన వెల్లడించారు.
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం రోజు బీజేపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. అయితే, ఈ మేనిఫెస్టోపై ఆప్ విరుచుకుపడుతోంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీజేపీ తన పథకాలను వెల్లడించింది. సిలిండర్లపై సబ్సిడీతలతో పాటు మహిళలకు, తల్లులకు, సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.
Indians In Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం 12 మంది భారతీయులు మరణించినట్లు ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన భారతీయులు అంతా రష్యా తరుపున పోరాడిన వారేనని వెల్లడించింది.
Sharon Raj murder case: 2022లో కేరళలో సంచలనం సృష్టించిన 23 ఏళ్ల రేడియాలజీ విద్యార్థి షారన్ రాజ్ హత్య కేసులో కేరళ కోర్టు గ్రీష్మా, ఆమె మామ నిర్మల కుమారన్ నాయర్లను దోషులుగా నిర్ధారించింది. నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు జనవరి 17న శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గ్రీష్మ తల్లి సింధుపై తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదల చేసింది. న్యాయమూర్తి ఎ.ఎం బషీర్ ఈ కేసులో జనవరి 19న శిక్షల పరిమాణాన్ని […]
Viral Video: తన భార్య, ఆమె ప్రియుడిని ఒక వ్యక్తి కారులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. దీంతో అతను కారు బానెట్‌పై పడిపోయాడు. అయినా కూడా ఆపకుండా ఒక కిలోమీటర్ వరకు ఇలాగే ఈడ్బుకుంటూ వెళ్లారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్-ఆగ్రా హైవేపై బుధవారం సాయంత్రం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 31 ఏళ్ల మొహద్ సమీర్, తన భార్య నూర్ అప్షా(29)ని, […]
PAK Youtubers: పాకిస్తాన్ ప్రభుత్వం, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడి యూట్యూబర్లను అణిచివేస్తోంది. ముఖ్యంగా భారత అభివృద్ధి, భారత విషయాలను కంటెంట్ కింద వాడుతూ, నిజాలను నిర్భయంగా చెబుతున్న ఇద్దరు ప్రముఖ యూట్యూబర్లు గత వారం నుంచి కనిపించకుండా పోయారు. సనా అమ్జద్, షోయబ్ చౌదరి అనే ఇద్దరు యూట్యూబర్లు భారత్‌లో కూడా చాలా ఫేమస్. తరుచుగా భారత్‌ని పాకిస్తాన్‌తో పోలుస్తూ అక్కడి ప్రజలకు అసలు నిజాలు చెబుతుంటారు. వీరిద్దరికి మిలియన్లలో సబ్స్క్రైబర్లు ఉన్నారు. మన దేశం […]