Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం రోజు బీజేపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. అయితే, ఈ మేనిఫెస్టోపై ఆప్ విరుచుకుపడుతోంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీజేపీ తన పథకాలను వెల్లడించింది. సిలిండర్లపై సబ్సిడీతలతో పాటు మహిళలకు, తల్లులకు, సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.
అయితే, బీజేపీ మేనిఫెస్టోపై ఆప్ విమర్శలు గుప్పి్స్తోంది. తమ ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తే, మీకు ఎందుకు ప్రజలు ఓటేయాలని ప్రశ్నించింది. పలు సందర్భాల్లో ఉచితాలు హానికరమని బీజేపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఆప్ విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాలు ఉచితాలకు, అభివృద్ధికి మధ్య తేడా తెలుసుకోవాని బీజేపీ ఎదురుదాడి చేసింది.
Read Also: Bharat Mobility Expo: డియో లవర్స్‌కి శుభవార్త.. స్పోర్టీ లుక్స్, మంచి మైలేజ్..
కేజ్రీవాల్ మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోకి ప్రధాని నరేంద్రమోడీ అనుమతి ఉందా.? అని ప్రశ్నించారు. ‘‘ఉచిత పథకాలు ప్రకటించే ముందు ప్రధాని మోదీ అనుమతి తీసుకున్నారా? ఉచితాలా దేశానికి నష్టం కాదని, దేవుడి ప్రసాదమని, ప్రధాని చెప్పంది తప్పుని, కేజ్రీవాల్ చెప్పింది రైట్ అని మోడీ ఒప్పుకోవాలి’’ అని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీలో అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది, ఇవి బీజేపీ వాళ్లకు కూడా అందుతున్నాయని, మాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదని, మాకు పనిచేయడమే తెలుసని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బీజేపీ వద్ద ‘‘సంకల్ప్ మేనిఫెస్టో’’ లేదని, కేవలం ‘‘కేజ్రీవాల్ మేనిఫెస్టో’’ ఉందని కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ విమర్శలపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. ఆప్ ఉచితాలకు, అభివృద్ధి సంక్షేమానికి మధ్య తేడాని అర్థం చేసుకోవాలని అన్నారు. మేనిఫెస్టోని ప్రకటించిన జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఆప్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు, ఢిల్లీలో, పంజాబ్‌లో తన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు. ఆప్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక మొహల్లా క్లినిక్‌లను “అవినీతి నిలయం” అని కూడా ఆయన అభివర్ణించారు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.