Bhatti Vikramarka: వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే
- కొమురం భీం జిల్లాలో భట్టి విక్రమార్క పర్యటన
- మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు
- ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధి దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అని భట్టి తెలిపారు. నీటి పారుదల సమస్యలు అడిగారు. అప్పుడు బ్రిడ్జి అడిగారు. వాటి పనులు పూర్తి చేసే పనిలో ఉన్నామన్నారు. ఓజా కళాకారుల కళ ఎంతో గొప్పది అని కొనియాడారు.
Also Read:ENE 2: అందుకే తప్పుకున్న.. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ పై సుశాంత్ షాకింగ్ పోస్ట్..
Also Read
కళాకారులను ఆదుకుంటాం అని అండగా ఉంటామని చెప్పాను. అందులో భాగంగా మీ ఓజా కళను కాడుకోవడం కోసం రుణాలు ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని మహాలక్ష్మి ల్లాగా ఉన్నారు.. మహిళలకు ఇప్పటికే రూ.26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. మహిళల్ని కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే మేము డబ్బులు కడుతున్నామని తెలిపారు. నాడు వెయ్యి రూపాయలు లేని పరిస్థితిలో ఉన్న మహిళను నేడు బస్సులకు ఓనర్లను చేశాం.. చెప్పినట్టుగానే ధరణి తీసి భూ భారతి తెచ్చామని భట్టి తెలిపారు.
Also Read:YS Jagan: భూసర్వేను మహాయజ్ఞంలా చేపట్టాం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశాం..!
కొమరం భీం ప్రాజెక్ట్ కెనాల్ కాలేదు అన్నారు.. వారికి ప్రపోజల్స్ పంపారు.. పనులు త్వరలో ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. దొడ్డు బియ్యం స్థానం లో సన్న బియ్యం ఇస్తున్నాం.. 96 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చాం. విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట, ప్రజా బాట పట్టారు. మీ సమస్యలు పరిష్కారం చేస్తారు. వారిని కలవండని గ్రామస్తులకు సూచించారు. 108 తరహాలో విద్యుత్ సమస్యల పైన 1912 ను సంప్రదించండి విద్యుత్ సమస్యలను పరిష్కారం చేస్తారని అన్నారు. మీ ప్రాంత సమస్య లను పరిష్కారం కోసం ఓ అంబులెన్స్ వస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?