Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన దేశంలో చర్చనీయాశంగా మారింది. ఇంట్లోకి దూరిన దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత దుండగుడు ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా పారిపోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
US Teacher: అమెరికాకు చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు, తన స్టూడెంట్తోనే శృంగార సంబంధం పెట్టుకుంది. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న లారా కారన్, తన పూర్వ విద్యార్థుల్లో ఒకరితో సంబంధం పెట్టుకుంది. దీని ఫలితంగా ఓ బిడ్డను కూడా కలిగి ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆమెను అక్కడి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల విద్యార్థితో బిడ్డను కలిగి ఉన్న నేరం కింద ఆమె అరెస్ట్ జరిగింది.
Bangladesh: పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా షేక్ హసీనా ఎప్పుడైతే పదవీ కొల్పోయిందో అప్పటి నుంచి నెమ్మదిగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ పాకిస్తాన్‌తో బంగ్లా రిలేషన్స్‌ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ముందు మోకాళ్లపై కూర్చున్న అల్బేనియా ప్రధాని ఏడీ రామా వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మెలోని 48వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఆయన అందమైన స్కార్ఫ్ బహూకరించారు. ఈ గిఫ్ట్ ఇచ్చేందుకు మోకాళ్లపై వంగాడు. ఈ ఘటన అబుదాబిలో జరుగుతున్న ‘‘వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్’’లో చోటు చేసుకుంది.
Congress: ప్రార్థనా స్థలాలా చట్టం-1991ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై గత నెలలో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించిందవి. అయితే, ప్రార్థనా స్థలాల కేసులో కాంగ్రెస్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. గురువారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆ పార్టీ కోరింది.
Saif Ali Khan: గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన ఆరు కత్తిపోట్లకు గురయ్యారు. మెడ, వెన్నుముకపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయనని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించారు.
NEET-UG 2025: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET-UG) 2025 కొత్త నియమాలను, షెడ్యూల్‌తో నిర్వహించబోతున్నట్లు జాతీయ పరీక్షా సంస్థ (NTA) గురువారం ధృవీకరించింది. 2024లో పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నీట్-యూజీ 2025 పెన్ను పేపర్ పద్ధతిలో (ఓఎంఆర్ షీట్), ఒకే రోజు మరియు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం తీసుకున్న పెన్-పేపర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలనే నిర్ణయం సురక్షితమైన, న్యాయమైన పరీక్షా ప్రక్రియకు తోడ్పడుతుందని […]
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై అతడి ఇంట్లోనే దుండగుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యావత్ చిత్రపరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరోవైపు రాజకీయ విమర్శలకు కూడా కారణమవుతోంది. దొంగతనం పాల్పడేందుకు వచ్చిన దుండగుడు, సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సైఫ్ 6 కత్తిపోట్లకు గురయ్యాడు. మెడ, వెన్నుముక ప్రాంతంలో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు […]
Trump's Inauguration: జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలకు, కీలక నాయకులకు, టెక్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే వారందరికి ఆహ్వానాలు వెళ్లాయి. యూఎస్ క్యాపిటల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు హాజరుకాబోతున్నారు.
Daya Nayak: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై ఈ రోజు తెల్లవారుజామున దుండగుడు దాడి చేసిన ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. సైఫ్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. అయితే, ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Read Also: […]