Sharon Raj murder case: “ప్రేమ..మోసం..ద్రోహం” సంచలన హత్య కేసులో దోషిగా ప్రియురాలు, ఆమె మామ..
- కేరళ, తమిళనాడులో సంచలనంగా షారోన్ రాజు హత్య కేసు..
- ప్రియురాలు విషం కలిపి హత్య చేసిందని నిర్ధారించిన కేరళ కోర్టు..
- ప్రేమ, మోసం, ద్రోహానికి ఉదాహరణగా నిలిచిన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharon Raj murder case: 2022లో కేరళలో సంచలనం సృష్టించిన 23 ఏళ్ల రేడియాలజీ విద్యార్థి షారన్ రాజ్ హత్య కేసులో కేరళ కోర్టు గ్రీష్మా, ఆమె మామ నిర్మల కుమారన్ నాయర్‌లను దోషులుగా నిర్ధారించింది. నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు జనవరి 17న శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో గ్రీష్మ తల్లి సింధుపై తగిన ఆధారాలు లేకపోవడంతో నిర్దోషిగా విడుదల చేసింది. న్యాయమూర్తి ఎ.ఎం బషీర్ ఈ కేసులో జనవరి 19న శిక్షల పరిమాణాన్ని ప్రకటించనున్నారు. హత్య, హానికరమైన పదార్థాలు ఉపయోగించి ఒక వ్యక్తికి హాని కలిగించడం, సాక్ష్యాలు నాశనం చేయడం, హత్య మరియు కిడ్నాప్ సెక్షన్ల కింద గ్రీష్మని, ఆమె మామని దోషులుగా ప్రకటించారు. అయితే, ఈ కేసులో గ్రీష్మ తల్లి సింధు నిర్దోషిగా విడుదల కావడంపై రాజు కుటుంబీకులు నిరాశ వ్యక్తం చేశారు. కేరళ హైకోర్టులో అప్పీలు దాఖలు చేస్తామని చెప్పారు.
Read Also: Fake Notes: కలవరపెడుతున్న రూ. 200 ఫేక్ నోట్లు.. మీ దగ్గర ఉన్నాయా? ఇలా గుర్తించండి!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
ప్రేమ, ద్రోహం.. కేసు వివరాలు ఇవే:
కేరళ, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. అక్టోబర్ 14, 2022న, షారోన్ తన స్నేహితుడు రెజిన్‌లో కలిసి కన్యాకుమారిలోని రామవర్మంచిరైలోని గ్రీష్మా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో గ్రీష్మా పురుగుల మందు కలిపిన ఆయుర్వేద కషాయాన్ని అతడికి ఇచ్చింది. అయితే, క్షణాల్లోనే షారోన్ వాంతులతో ఆస్పత్రిలో చేరాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన తర్వాత షారోన్ పరిస్థితి మెరుగైనట్లు కనిపించింది.
అయితే, అతను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యం వేగంగా క్షీణించింది. అక్టోబర్ 17న తిరువనంతపుర మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేరాడు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి కారణమయ్యే యాసిడ్‌ని తీసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. రోజుల తరబడి డయాలసిస్, ఇతర చికిత్సలు చేసిన తర్వాత, అక్టోబర్ 25న షారోన్ గుండెపోటుతో మరణించాడు. గ్రీష్మా ఇచ్చిన కషాయం తాగిన తర్వాత షారోన్ కనీసం నీరు కూడా తాగలేకపోయే స్థితికి చేరి మరణించడం విషాదం.
షారోన్ అనారోగ్య విషయంలో, అతడి కుటుంబానికి అనుమానాలు పెరిగాయి. గ్రీష్మ ఇచ్చిన కషాయం చుట్టూ పోలీసులు విచారణ జరిపారు. షారోన్ కూడా తన మరణ వాంగ్మూలంలో గ్రీష్మ ఇచ్చిన పదార్థం తీసుకున్న తర్వాతే తనకు ఇలా జరిగిందని చివరకు చెప్పాడు. మొత్తంగా ఒక ప్రేమ కథ ద్రోహం, మోసం, విషాదంగా మారింది.

Read Also: Thug Life: థగ్ లైఫ్ కోసం ఇంత పెట్టడానికి రెడీ అయ్యారా?
కషాయంలో విషం:
గ్రీష్మని విచారించగా, కషాయంతో విషం కలిపినట్లు చెప్పింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇలా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. విచారణలో పారాక్వాట్ కలిపిన కషాయం ఇచ్చినట్లు తేలింది. విచారణ సందర్భంగా తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంటర్నల్ మెడిసిన్ హెడ్ డాక్టర్ అరుణ ఆర్ చెప్పిన దాని ప్రకారం.. 15 మి.లీ పారాక్వాట్ స్మాల్ డోస్ కూడా ప్రాణాంకతమని చెప్పారు. ఇలాంటి విషానికి విరుగుడు కూడా లేని వెల్లడించారు.
హత్యకు కారణం:
గ్రీష్మా, షారోన్ రాజు ఒక బస్సు ప్రయాణంలో కలుసుకున్నారు. ఆతర్వాత ఏడాది పాటు సంబంధాన్ని కొనసాగించారు. షారోన్ రేడియాలజీ విద్యార్థి కాగా, గ్రీష్మ సాహిత్యంలో పీజీ చేస్తోంది. అయితే, ఫిబ్రవరి 2022లో గ్రీష్మకు తమిళనాడుకు చెందిన ఒక ఆర్మీలో పనిచేస్తున్న వ్యక్తితో వివాహం కుదిరింది. అయితే, షారోన్ మాత్రం గ్రీష్మతో సంబంధాన్ని ముగించడానికి ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా షారోన్ అడ్డు తొలగించుకునేందుకు గ్రీష్మ అతడి ప్రాణాలను తీసింది. ఈ హత్యకు గ్రీష్మ తల్లి సింధు, మామ నిర్మల కుమారన్ నాయర్ సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుని అప్పటి జిల్లా ఎస్పీ డి శిల్ప నేతృత్వలోని సిట్ దర్యాప్తు చేసింది.
గ్రీష్మ గతంలో కూడా ‘‘జ్యూస్ ఛాలెంజ్’’ ద్వారా షారోన్‌పై విష ప్రయోగం చేయాలని చూసింది. పారాసెటమాల్ మాత్రల్ని ఎక్కువ మొతాదులో కలిపి షారోన్‌కి ఇచ్చింది. అయితే, మామిడి పండ్ల రసం చాలా చేదుగా ఉండటంలో ప్రయత్నం విఫలమైంది.
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్‌లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!