Daya Nayak: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై ఈ రోజు తెల్లవారుజామున దుండగుడు దాడి చేసిన ఘటన దేశాన్ని షాక్‌కి గురిచేసింది. సైఫ్ ఒంటిపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు చెప్పారు. అయితే, ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Read Also: […]
Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సొంత దేశం, సొంత పార్టీతో పాటు ప్రపంచ దేశాల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్‌తో వైరం పెంచుకున్నాడు. ఖలిస్తానీవాదులకు మద్దతుగా నిలిచాడు.
Allahabad HC: భార్య మద్యం సేవిస్తుందని ఆరోపించిన భర్తకు విడాకులు ఇవ్వడానికి ఉద్దేశించబడిన కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి మద్యం సేవించడం హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం, వివాహాన్ని రద్దు చేసేంత క్రూరత్వం కాదని చెప్పింది. తన భార్య క్రూరత్వం కారణంగా విడాకుల కోసం చేసుకున్న అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసుకున్న సమయంలో ఈ తీర్పు వచ్చింది.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడి దాడి యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగుడిని అడ్డుకునే ప్రయత్నంలో సైఫ్ కత్తిపోట్లకు గురయ్యాడు. మొత్తం 6 కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డాడు. దాడి అనంతరం వెంటనే సైఫ్‌ని ఆస్పత్రికి తరలిండచంతో ప్రాణాపాయం తప్పింది. ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. సైఫ్ ఇంటికి ఉన్న ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా దుండగుడు ఇంటిలోకి ప్రవేశించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 10న ఆయన పదవీస్వీకారం చేయబోతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్‌పై ట్రంప్ ఘన విజయం సాధించారు. మరోసారి ఆయన అగ్రరాజ్యానికి అధినేత కాబోతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్(ECFR) నిర్వహించిన గ్లోబల్ పోల్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్‌కి భారతీయులే అతిపెద్ద మద్దతుదారులుగా ఉన్నట్లు తేలింది.
Internet Users In India: భారతదేశంలో రికార్డు స్థాయిలో ఇంటర్నెట్ యూజర్లు పెరుగుతున్నారు. 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లను దాటుతుందని గురువారం ఒక నివేదిక వెల్లడించింది. డిజిటల్ కంటెంట్ కోసం దేశంలోని ప్రాంతీయ భాషల వినియోగం పెరుగుతుండటం ఇంటర్నెట్ యూజర్ల పెరుగుదలకు కారణంగా ఉందని చెప్పింది. ఇండియాలో 2024 నాటికి ఈ సంఖ్య 88.6 కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 8 శాతం బలమైన వృద్ధిని సూచిస్తుంది.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి సంచలనంగా మారింది. ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన దుండగుడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. మెడపై, వెన్నుముకపై బలమైన గాయాలయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండుగుడి దాడి యావత్ సినీ పరిశ్రమని షాక్‌కి గురిచేసింది. గురువారం తెల్లవారుజామున సైఫ్ ఇంటిలోకి ప్రవేశించిన దుండుగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. నటుడి ఒంటిపై మొత్త ఆరు కత్తిపోట్లు ఉన్నాయి. మెడపై , వెన్నుముకలో తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో సైప్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించారు.
Tata Nexon 2025: టాటా మోటార్స్ మోస్ట్ సెల్లింగ్ కార్ నెక్సాన్ ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చింది. మరిన్ని ఫీచర్లు, కలర్ ఛాయిస్‌లతో టాటా నెక్సాన్ 2025 లాంచ్ అయింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌కి మరింత గట్టి పోటీ ఇవ్వబోతోంది.
Tamil Nadu: తమిళ కవి తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నివాళులు అర్పించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బుధవారం చెన్నైలోని రాజ్ భవన్ ప్రాంగణంలో తిరువళ్లువర్ చిత్రపటానికి గవర్నర్ రవి పూలమాలలు వేసి నివాళులర్పించారు.