Haj yatra: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ‘‘హజ్ యాత్ర’’కు సంబంధించి భారత్-సౌదీ అరేబియాల మధ్య ‘‘హజ్ ఒప్పందం’’ కుదిరింది. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ఖరారైన తర్వాత భారతదేశంతో ‘‘పవిత్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని సౌదీ అరేబియా గురువారం తెలిపింది.
ఈ ఒప్పందం ప్రకారం.. ఈ ఏడాది భారత్ నుంచి 1,75,025 మంది ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్తారు. ఈ ఒప్పందంపై మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు, సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియా సంతకం చేశారు.
Read Also: Manoj Manchu: సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. అన్నకు మంచు మనోజ్ షాకింగ్ కౌంటర్
ఈరోజు ఒప్పందాన్ని స్వాగతిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ‘‘ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాను. ఇది భారత్ నుంచి హజ్ వెళ్లే యాత్రికులకు అద్భుతమైన వార్త, భక్తులకు మెరుగైన తీర్థయాత్ర అనుభవాలను నిర్ధారించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని అన్నారు.
హజ్ తీర్థయాత్రను పెంపొందించడానికి మోడీ నిబద్ధతకు సౌదీ అరేబియా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ పవిత్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం సౌదీ అరేబియా రాజ్యానికి గౌరవం. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులకు రెండు పవిత్ర మసీదులలో సేవ చేయడం, ముస్లింలందరి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సుసంపన్నం చేయడం పట్ల మా శాశ్వత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, ” అని సౌదీ మంత్రి అల్ రుబియా అన్నారు.