Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి నోరుజారారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘‘ భారత రాజ్యంపై పోరాటం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్, భారత రాజ్యంపై పోరాడుతున్నాము’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేష్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
Gaza Ceasefire: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరు వర్గాలు కాల్పుల విరమణ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయిలీ బందీలను విడుదల చేసేందుకు అంగీకరించింది. హమాస్ తాము విడదల చేయాలని యోచిస్తున్న ముగ్గురు ఇజ్రాయిల్ బందీల పేర్లను ప్రకటించింది. దీంతో గాజాలో కాల్పులు విరమణకు మార్గం సుగమైంది.
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన సంచలనంగా మారింది. గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని నటుడి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కి ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి వెన్నెముకలో విరిగిన కత్తిని తొలగించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు చెప్పారు. అయితే, నిందితుడి కోసం మూడు […]
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడిని థానేలో పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్‌కి చెందిన వాడిగా గుర్తించారు. ఈ రోజు కోర్టు ముందు అతడిని ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్‌కి చెందిన వాడు కాబట్టి ‘‘అంతర్జాతీయ కుట్ర’’ అనుమానాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది.
India-Bangladesh Border: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. ముఖ్యం పాకిస్తాన్‌తో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. మరోవైపు ఆ దేశంలోని మైనారిటీలు, ప్రధానం హిందువులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారు. ఇక బంగ్లా మాజీ ఆర్మీ అధికారులు భారత్‌కి వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. Read Also: Rahul Gandhi: […]
Rahul Gandhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్‌తో పొత్తుపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు ఉండకూడదని కోరుకున్నానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఆప్‌కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించినప్పుడు..
Rahul Gandhi: బీహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రజల్ని మోసం చేయడానికే అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో అభివృద్ధి పనులు చేయడానికి కులగణన అనేది చాలా అవసరమని అన్నారు. శనివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమ పార్టీ కులగణనకు కట్టుబడి ఉందని అన్నారు.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడి తర్వాత నుంచి 30 టీములతో నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లో దాడి చేసినట్లు భావిస్తున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దుర్గ్ జిల్లాలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు 31 ఏళ్ల ఆకాష్ కైలాష్ కన్నోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదుపులోకి తీసుకుంది.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తిదాడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో దాడిచి సైఫ్ అలీ ఖాన్ని గాయపరిచాడు. సైఫ్ శరీరంపై ఆరో చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకపై తీవ్ర గాయం కావడంతో పాటు మెడపై గాయాలు ఉన్నాయి. దాడి జరిగిన వెంటనే అతని నివాసం ఉన్న బాంద్రా నుంచి లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఆయనకు డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి, ఆయన వెన్నుముకలో […]
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ఆయన గద్దెనెక్కబోతున్నారు. అయితే, అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే టాప్-10 ఆదేశాలు ఇవ్వబోతున్నారు. గతంలో మొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ట్రంప్, కేవలం అప్పటి ఒబామా కేర్ని లక్ష్యంగా చేసుకుని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేవారు. ఈ సారి మాత్రం తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 1) అక్రమ వలసదారుల […]