Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌తో 7 ఏళ్ల కొడుకు ఆస్పత్రి వెళ్లడం ఏంటి..? జవాబు లేని 5 ప్రశ్నలు..
- సైఫ్ అలీ ఖాన్ కేసులో జవాబు లేని 5 ప్రశ్నలు..
- దుండగుడు ఎలా వచ్చి, తప్పించుకున్నాడు..?
- కారు ఎందుకు సిద్ధంగా లేదు..?
- ఆస్పత్రికి తైమూర్ తప్పా, కుటుంబ సభ్యులు ఎందుకు వెళ్లలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగి దాదాపుగా ఒకటిన్నర రోజు కావస్తోంది. అయితే, ఇప్పటికీ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడం లేదు. ఆయనపై దాడి ఘటన మొత్తం చిత్రపరిశ్రమనే షాక్‌కి గురిచేసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
1) చొరబాటుదారుడు బిల్డింగ్ సెక్యూరిటీని ఎలా తప్పించుకున్నాడు..?
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
బాంద్రాలోని సంపన్నులు ఉండే ప్రాంతంలో సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటున్నారు. దాడి అనంతరం ఫైర్ ఎస్కేప్ మెట్ల ద్వారా తెల్లవారుజామున 2.33 గంటలకు నిందితుడు పారిపోయినట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. మరో వీడియోలో తెల్లవారుజామున 1.37 గంటలకు భవనంలోకి ప్రవేశించినట్లు రికార్డైంది. అతను షాఫ్ట్ కిటీకి ద్వారా బాత్రూంలోకి చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, ఇక్కడ విషయం ఏంటంటే బిల్డింగ్ సెక్యూరిటీ నుంచి ఎలా తప్పించుకున్నాడనేది పెద్ద ప్రశ్నగా మారింది.
2) ఎలా తప్పించుకున్నాడు..?
ఇంట్లోకి ప్రవేశించి, సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి మళ్లీ ఆ ఇంటి నుంచి ఎవరి కంటా పడకుండా తప్పించుకున్నాడు. అతను గదిలోకి ప్రవేశించిన షాఫ్ట్ కిటీకినే మళ్లీ ఉపయోగించాడా..? అనేది మరో ప్రశ్న.
3) బిల్డింగ్ లేఅవుట్ తెలుసా..?
ఎవరూ గమనించకుండా, పక్కా ప్లాన్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న డ్యూప్లెక్స్ ఇంటికిలోకి చొరబాటుదారుడు ఎలా వచ్చాడు. అతడికి బిల్డింగ్ లేఅవుట్ గురించి పూర్తిగా తెలుసా అనే ప్రశ్నిని లేవనెత్తుతోంది. లేఅవుట్ గురించి తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇంతకుముందు ఆ బిల్డింగ్‌లోకి వచ్చి ఉండాలి లేదా హౌసింగ్ సొసైటీలో ఎవరైనా అతడికి సమాచారం ఇచ్చి ఉండాలి.
4) సైఫ్ అలీ ఖాన్‌ని ఆటోలో ఎందుకు తీసుకెళ్లారు..?
కోట్లకు అధిపతి, బిల్డింగ్ నిండా కార్లు అయినా కూడా ఆయనను ఓ ఆటోలో ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు.? అనేది మరో ప్రశ్న. నివేదికల ప్రకారం, ఘటన జరిగిన వెనువెంటనే కారుని సిద్ధం చేయలేకపోవడమో, డ్రైవర్ అందుబాటులో లేకపోవడమో కారణమని చెబుతున్నారు. తన చిన్న కొడుడు, 7 ఏళ్ల తైమూర్, అతడి కేర్‌టేకర్ మాత్రమే సైఫ్‌తో ఆస్పత్రికి వెళ్లారు.
5) కుటుంబ సభ్యులు ఎందుకు ఆస్పత్రికి వెళ్లలేదు..?
రక్తం కారుతూ, తీవ్ర ప్రమాదంలో ఉన్న సైఫ్ వెంట కేవలం 7 ఏళ్ల తైమూర్ మాత్రమే ఎందుకు వెళ్లాడు..? కుటుంబ సభ్యులు మరెవరు తోడుగా ఎందుకు లేరనేది అందర్ని తొలుస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!