Guillain-Barre Syndrome: పూణేతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను వణికిస్తున్న గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS) కారణంగా ఒక యువకుడు మరణించాడు. ధయారి ప్రాంతంలో నివసిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) శనివారం సాయంత్రం షోలాపూర్‌లో చికిత్స పొందుతూ మరణించారు.
UP News: పంటకు పురుగులమందు చల్లిన తర్వాత చేతులు కడుక్కోవడానికి నిరాకరించిన రైతు మరణించిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ మథురలో జరిగింది. 27 ఏళ్ల యువ రైతు తన పొలంలో పంటకు పురుగుల మందు చల్లిన తర్వాత, చేతులు కడుక్కోకుండా రాత్రి భోజనం చేశాడు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురై మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. శనివారం రాత్రి ఆలస్యంగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిని షరీఫుల్ ఇస్లాం అనే బంగ్లాదేశీ అతడిపై కత్తితో దాడి చేసి, ఆరు చోట్ల గాయపరిచాడు. గాయపడిన సైఫ్‌ని వెంటనే సమీపంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అతడి వెన్నెముకలో ఇరుక్కుపోయిన కత్తిని తొలగించడానికి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నటుడు కోలుకున్నాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ బస్తర్ ఏరియా, నక్సలిజానికి కంచుకోట. ఇప్పటికీ దేశంలో మావోయిస్టులు చాలా యాక్టివ్‌గా ఉన్న ప్రాంతం. నిత్యం ఎన్కౌంటర్లలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఈ పోరులో అనేక గిరిజన పల్లెలు గత కొన్ని దశాబ్ధాలుగా కొట్టుమిట్టాడుతున్నాయి.
Saif Ali Khan Case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు వేలిముద్రలు ఒక్కటి కూడా సరిపోవడం లేదు. దీంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు. బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరికి ప్రయత్నించి, సైఫ్‌పై దాడి చేసి నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. ఫోరెన్సిక్ సేకరించిన 19 సెట్ల వేలిముద్రలు నిందితుడితో సరిపోలడం లేదు. దీంతో మరోసారి విచారణ మొదటికొచ్చింది.
iPhone: ఇటీవలి iOS 18+ సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఐఫోన్లతో పనితీరు సమస్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం టెక్ దిగ్గజం ఆపిల్‌కి నోటీసులు జారీ చేసినట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. సాంకేతిక సమస్యలకు సంబంధించి ససెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) యాపిల్ని వివరణ కోరింది.
Chhattisgarh: 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులిద్దరిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఐదుగురు వ్యక్తులకు ఛత్తీస్‌గఢ్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేరాన్ని అత్యంత నీచమైన, అసహ్యమైన, పాశవిక దాడిగా అభివర్ణించిన కోర్టు, ఇది సమాజం యొక్క మనస్సాక్షిని కదిలించిందని చెప్పింది. కోర్బా జిల్లాలోని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు హత్య, అత్యాచారం, సామూహిక అత్యాచారం ఎస్సీ/ఎస్టీ, పోక్సో చట్టాల కింద నిందితులను దోషులుగా నిర్ధారించింది. 2021లో జరిగిన […]
Karnataka: కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్ణాటకలో మరో వివాదం తెర పైకి వచ్చింది. కర్ణాటక యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి సెమిస్టర్ పాఠ్యపుస్తకాంలో ‘‘విద్వేషపూరిత’’ కంటెంట్ ఉండటంపై వివాదం చెలరేగింది. కర్ణాటక లా స్టూడెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. ‘‘బెళగు 1’’ పుస్తకంలో ‘‘రాష్ట్రీయతే’’ అనే శీర్షికతో కూడిన అంశాలు ఉన్నాయని,
Rajouri: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. గత నెల రోజులుగా 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ మిస్టరీకి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం చెప్పారు. మిస్టరీ ఇన్ఫెక్షన్ వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే వాదనని ఆయన తోసిపుచ్చారు. డిసెంబర్ 7 నుండి జనవరి 19 వరకు జరిగిన ఈ మరణాలు రాజౌరిలోని మారుమూల బాధాల్ గ్రామంలోని మూడు కుటుంబాలలో సంభవించాయి. Read Also: Saif […]
Dog Attack: దేశంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు వీటికి టార్గెట్‌గా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లో ఓ వృద్ధరాలిపై కుక్కల గుంపు దాడి చేసింది. పంజాబ్ ఖన్నాలోని నాగరిక నాయి అబాది ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.