CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నెల 3వ తేదీన కొంతమంది యువకులు కారుతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ప్రియాంక, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువ డాక్టర్ నిండు నూరేళ్ల జీవితం ఇలా ముగిసిపోవడం తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.
ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసు దర్యాప్తు పురోగతిని, తదుపరి చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారని ఎస్పీ సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, నిర్లక్ష్యంగా ప్రవర్తించి ప్రాణాలు తీసిన నిందితులపై కఠినమైన చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంకకు రాజమండ్రిలో అందించిన ప్రాథమిక చికిత్స, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. ఈ సందర్భంగా ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. క్లిష్ట సమయంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన ప్రతి సాయాన్ని అందిస్తుందని సీఎం భరోసా ఇచ్చారు.
తాజావార్తలు
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
-
IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!