Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- రూ.2.5 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్
- ఒడిశా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలింపు
- స్నాప్‌చాట్ ద్వారా సరఫరాదారుతో పరిచయం
- ORR వద్ద మాటువేసి పట్టుకున్న ఈగల్ ఫోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hash Oil : ఈగల్ ఫోర్స్ , అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన పక్కా ఆపరేషన్‌లో ఓ డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 2.5 లక్షల విలువైన 200 మిల్లీలీటర్ల (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నివాసముంటూ జీవనోపాధి కోసం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, చెడు వ్యసనాలకు బానిసైన అతడు గతంలోనే గంజాయి విక్రయిస్తూ సరూర్‌నగర్, మీర్పేట్ పోలీసు స్టేషన్లలో పలు ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గత నవంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు, డ్రైవింగ్ ద్వారా వచ్చే ఆదాయం చాలకపోవడంతో మళ్లీ డ్రగ్స్ దందా వైపు మళ్లాడు.
స్నాప్‌చాట్ ద్వారా నెట్వర్క్.. కోరాపుట్ నుంచి అక్రమ రవాణా
పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నరేంద్ర శ్రీనివాస్ స్నాప్‌చాట్ యాప్‌ను వేదికగా చేసుకున్నాడు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువాకు చెందిన ‘హరి’ అనే సరఫరాదారుడితో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం పెంచుకుని, అక్కడ రూ. 9,000కు కొనుగోలు చేసిన హ్యాష్ ఆయిల్‌ను హైదరాబాద్‌లో 10 మిల్లీలీటర్లను రూ. 1,200 చొప్పున విక్రయించేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 2న ఒడిశా వెళ్లిన అతడు, అక్కడి నుంచి హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి ఆగస్టు 7న బస్సులో బయలుదేరాడు. అరెస్టు కాకుండా ఉండేందుకు ముందుగా టికెట్లు బుక్ చేసుకోకుండా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణించే పద్ధతిని ఎంచుకున్నాడు.
Also Read
- Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
- Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
- Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!
- Hyderabad: జీహెచ్ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి రావు ఇళ్లపై ఏసీబీ దాడులు.. ఏకకాలంలో సోదాలు
ORR వద్ద పట్టుకున్న పోలీసులు..
విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 8న ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వద్ద నిఘా ఏర్పాటు చేశారు. ఒడిశా నుంచి వచ్చిన బస్సు దిగగానే నరేంద్ర శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతడి నుంచి రెండు బాటిళ్లలో ఉన్న హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, పరారీలో ఉన్న ముఖ్య సరఫరాదారు హరి కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
-
Mumbai Indians: “సూర్యకుమార్‌ను వదులుకోం”.. హార్దిక్ పాండ్యా విషయంలో నోరు మెదపని ముంబై మేనేజ్మెంట్..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!