Venu Goapl Reddy
Author- NTV Telugu-
RG Kar Medical College: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని మృతి.. లవర్‌పై పేరెంట్స్ ఆరోపణ..
RG Kar Medical College: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ చదువుతున్న గిరిజన మహిళా వైద్య విద్యార్థి మరణం వివాదాస్పదంగా మారింది. పీజీ వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు తర్వాత, మరోసారి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వార్తల్లో నిలిచింది. -
Pakistan: లష్కరే తోయిబా హెడ్‌క్వార్టర్ పునర్నిర్మాణానికి పాకిస్తాన్ సాయం.. “సిందూర్”లో ధ్వంసం..
Pakistan: పాకిస్తాన్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ పంజాబ్‌లోని మురిడ్కే లోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్‌ని ధ్వంసం చేసింది. మే 7న భారత్ జరిపిన దాడిలో లష్కర్ ప్రధాన కార్యాయలం దెబ్బతిన్నది. అయితే, ఇప్పుడు పాకిస్తాన్ దెబ్బతిన్న భవనం శిథిలాలను తొలగిస్తోంది. కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. -
Virat Kohli: తాలిబాన్ లీడర్ నుంచి విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన..
Virat Kohli: ఆఫ్ఘనిస్తాన్ నేత, తాలిబాన్ ఉద్యమ నాయకుడు అనస్ హక్కానీ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన వచ్చింది. విద్య, క్రీడలు అంటేనే కోపగించుకునే తాలిబాన్లలో కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అనాస్ హక్కానీ కూడా క్రికెట్‌కు, కోహ్లీకి అభిమాని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లపై హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరు మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు. -
Manisha Koirala: నేపాల్ ‘‘హిందూ దేశం’’గా ఉన్నప్పుడే బాగుండేది..
Manisha Koirala: నేపాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు జరిపింది. ఈ ఆందోళనలతో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ హింసాత్మక ఆందోళనల్లో 50 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం, నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట్లాడిన పాత వీడియో వైరల్‌గా మారింది. -
CHINA: మేము యుద్ధాలకు సృష్టించం, పాల్గొనం.. ట్రంప్‌కి చైనా కౌంటర్..
CHINA: రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. -
Zohran Mamdani: న్యూయార్క్‌లో నెతన్యాహూను అరెస్ట్ చేయిస్తా.. మమ్దానీ వార్నింగ్..
Zohran Mamdani: న్యూయార్క్ మేయర్ పదవికి ముందు వరసలో ఉన్న డెమొక్రాట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నగర మేయర్‌గా ఎన్నికైతే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను నగరంలోకి ప్రవేశిస్తే, అరెస్ట్ చేయాలని న్యూయార్క్ పోలీస్ శాఖను ఆదేశిస్తానని అన్నారు. ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిని నేను నేరవేర్చాలనుకుంటున్నానని అన్నారు. -
London: నేపాల్ తర్వాత, లండన్‌లో భారీ నిరసనలు.. లక్షల్లో పాల్గొన్న జనం..
London: నేపాల్ హింసాత్మక ఘటనల తర్వాత పలు దేశాల్లో అనేక విషయాలపై నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా యూకే రాజధాని లండన్‌లో భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూకే చరిత్రలోనే అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. వలసకు వ్యతిరేకంగా టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్ష మందికి పైగా నిరసనకారులు మార్చ్ చేశారు. ఈ ప్రదర్శనల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. -
Pakistan: ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన తర్వాత పాకిస్తాన్లో ఏం జరిగింది.? లాడెన్ భార్యల్ని పాక్ ఏం చేసింది..?
Pakistan: అల్ ఖైదా అధినేత, అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను యూఎస్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో హతమార్చాయి. 2001 సెప్టెంబర్ 11 దాడులు జరిగిన దాదాపు 10 ఏళ్ల తర్వాత లాడెన్ జాడను కనిపెట్టి, 2011 మే 2న యూఎస్‌కు చెందిన నేవీ సీల్స్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, హతం చేశాయి. -
Waqf (Amendment) Act: వక్ఫ్ చట్టంపై సెప్టెంబర్ 15 సుప్రీంకోర్టు తీర్పు..
Waqf (Amendment) Act: వక్ఫ్(సవరణ)చట్టం-2025పై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 తీర్పు వెల్లడించనుంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ స్టే కోరుతూ దాఖలపై పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం తన మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తుంది. మూడు ప్రధాన అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తుంది. వీటిలో ‘‘వక్ఫ్ బై యూజర్’’, వక్ఫ్ బై కోర్ట్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం కూడా ఉంది. మూడు రోజలు పాటు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత […] -
Vijay: బీజేపీ, డీఎంకేలను వదిలిపెట్టం, దళపతి విజయ్ వార్నింగ్..
Vijay: తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ శనివారం తన రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి తన తొలి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో డీఎంకేలు రెండూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వారు ఇచ్చిన హామీలు విఫలమయ్యాయని అన్నారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు దేవాలయాల్లో ప్రార్థనలు చేసినట్లుగా, 2026 ప్రజాస్వామ్య యుద్ధానికి సిద్ధమయ్యే ముందు ప్రజలను కలవడానికి వచ్చానని విజయ్ అన్నారు. తాను తమిళ ప్రజల…
తాజావార్తలు
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..