Uber And Ola: ఇటీవల ఆండ్రాయిడ్, ఐఫోన్ ఫోన్లను బట్టి వేర్వేరు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఓలా, ఉబర్‌పై ఆరోపణలు వచ్చాయి. రైడ్ బుక్ చేసుకోవడానికి ఉపయోగించే మొబైల్ పరికరాల మోడళ్లను బట్టి వేర్వేరు ధరలు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. రెండు సంస్థలుకు వినియోగదారుల మంత్రిత్వ శాఖ గురువాం నోటీసులు జారీ చేసింది.
Delhi High Court: లైంగిక చర్యలకు మహిళ అంగీకరించినప్పటికీ, ఆమె వీడియోలు, తీయడం నేరమే అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. లైంగిక చర్యల్లో పాల్గొనడానికి ఒక మహిళ అంగీకరించడాన్ని ఆమె అనుచిత వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి అంగీకారంగా పరిగణించలేమని తీర్పు చెప్పింది.
Supreme Court: కొడుకు ప్రేమ వ్యవహారాన్ని తల్లి ఒప్పుకోకపోవడం అనేది, అతడిని ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్యను ప్రేరేపించినట్లు కాదని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. తన ప్రేమికుడిని వివాహం చేసుకోకుండా జీవించలేదని, ఆత్మహత్యకు పాల్పడటం, సదరు అమ్మాయిన ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కాదని సుప్రీకోర్టు స్పష్టం చేసింది.
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు బంగ్లాదేశీ అయిన వ్యక్తిని పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దొంగతనం కోసం ప్రవేశించిన, మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే దుండగుడు, సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు.
Pakistani Youtuber: పాకిస్తాన్ యూట్యూబర్లు కనిపించకుండా పోవడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రో-ఇండియా కంటెంట్ చేసే ప్రముఖ యూట్యూబర్ల అయిన సనా అమ్జాద్, సోయబ్ చౌదరిలు గత 21 రోజులుగా కనిపంచలేదు. వీరిని పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ కిడ్నా్ప్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
Balasaheb Thackeray: శివసేన వ్యవస్థాపకులు, దివంగత బాలాసాహెబ్ ఠాక్రే జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన తన విశ్వాసాల విషయంలో ఎక్కడ రాజీ పడలేదని, భారతీయ సంస్కృతి గర్వాన్ని పెంచడానికి ఎల్లప్పుడూ కృషి చేశారని ప్రధాని అన్నారు.
Pune: మహారాష్ట్ర పూణేని గుల్లెయిన్-బారే సిండ్రోమ్(GBS) వ్యాధి కలవరపెడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 54 కేసులు నమోదైనట్లు పూణే డివిజనల్ కమిషనర్ డాక్టర్ చంద్రకాంత్ పుల్కండ్వర్ తెలిపారు. మరో నలుగురికి ఈ అరుదైన నాడీ రుగ్మత ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పూణే మున్సిపల్ కార్పొరేషన్లో 24 మందికి జీబీఎస్‌తో బాధపడుతున్నట్లు పలు ఆస్పత్రులు నివేదించిర తర్వాత, డాక్టర్ పుల్కండ్వర్ రాష్ట్ర, జిల్లా ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వహించారు.
Maharashtra Train Accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జలగావ్‌లోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయనే భయంతో ప్రయాణికులు ట్రాక్‌పైకి దూకారు. అదే సమయంలో ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగులు అక్కడిక్కడే మరణించారు. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో చైన్ లాగడంతో మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Shocking: కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయి మారాడు. భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు.
Enemy Act: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఇటీవల ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇదిలా ఉంటే, మరో వార్తలో ఆయన సంచలనంగా మారారు.