Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..
- కిన్నార్ అఖాడా నుంచి మమతా కులకర్ణి బహిష్కరణ..
- ఇటీవలే సన్యాసం తీసుకున్న ఒకప్పటి అందాల నటి..
- గతంలో క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉండటంతోనే బహిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamta Kulkarni: అలనాటి బాలీవుడ్ అందాల తారా మమతా కులకర్ణి ఇటీవల సన్యాసం తీసుకోవడం వార్తల్లో ప్రధానంగా నిలిచింది. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సమయంలో ఆమె సన్యాస దీక్షను స్వీకరించారు. కాషాయ వస్త్రాలు, నుదుటిపై తిరకం, మెడలో మాలలతో కనిపించారు. ఆమె పేరుని శ్రీమాయి మమతానంద్ గిరిగా ప్రకటించారు కిన్నార్ అఖారా(ఆశ్రమం)లో ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో మమతా కులకర్ణి దీక్ష తీసుకున్నారు. ఆమెను మహామండలేశ్వర్‌గా నియమించారు.
అయితే, ఇప్పుడు ఈ మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదమైంది. తాజాగా కిన్నార్ అఖాడా నుంచి మమతా కులకర్ణితో బహిష్కరించారు. ఆమెతో పాటు లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కూడా బహిష్కరించారు. కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ వీరిద్దరి నుంచి అఖాడా నుంచి బహిష్కరించినట్లు తెలిసింది. మమతా కులకర్ణిని మహామండలేశ్వర్‌గా నియమించడం వివాదాస్పదం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read
Read Also: Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
‘‘కిన్నార్ అఖాడా వ్యవస్థాపకుడిగా, నేను ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కిన్నార్ అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ పదవి నుంచి తక్షణమే తొలగిస్తున్నారు. మతపరమైన కార్యకలాపాలను ప్రోత్సహించడం, లింగమార్పిడి సమాజాన్ని ఉద్ధరించడం లక్ష్యంగా ఆయన నియామకం జరిగింది. కానీ ఆయన ఈ బాధ్యతల నుంచి పక్కకు జరిగారు’’ అని జనవరి 30, 2025న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రిషి అజయ్ దాస్ పేర్కొన్నారు. అఖాడా వ్యవస్థాపకుడి అనుమతి లేకుండా త్రిపాఠి మమతా కులకర్ణిని నియమించారని ఆరోపించారు.
ఈ వివాదం త్రిపాఠి 2019లో జునా అఖాడాతో కుదుర్చుకున్న ఒప్పందం చుట్టూ తిరిగింది. ఇది అజయ్ దాస్ తన అనుమతి లేకుండా జరిగిందని ఆరోపించారు. ఇద్దరు అఖాడాల మధ్య ఒప్పందం తన సమ్మతి, సంతకం లేకపోవడం వల్ల చట్టబద్ధంగా చెల్లదని ఆయన అరోపించారు. మమతా కులకర్ణి గతంలో నేర కార్యకలాపాల్లో పాల్గొన్నప్పటికీ, ఆమె మహామండలేశ్వర్‌లో చేరడానికి, ప్రతిష్టాత్మక పాత్రను చేపట్టడానికి అనుమతించడం ద్వారా త్రిపాఠి కిన్నార్ అఖాడా సిద్ధాంతాలను దెబ్బతీశారని అజయ్ దాస్ ఆరోపించారు. ఆమెకు గతంలో నేర చరిత్ర ఉందని ఆయన ఆరోపించారు. అలాంటి వ్యక్తిని మహామండలేశ్వర్ బిరుదు ఇవ్వడం ద్వారా మీరు సనాతన ధర్మారానికి ఎలాంటి గురువును అందిస్తారు.? ఇది నైతికతకు సంబంధించిన ప్రశ్న అని ఆయన అన్నారు.
అయితే, ఇద్దరి బహిష్కరణ కొత్త చర్చకు దారి తీసింది. అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర త్రిపాఠి కులకర్ణికి మద్దతు తెలిపారు. వీరిని బహిష్కరించడానికి రిషి అజయ్ దాస్ ఎవరు అని ప్రశ్నించారు. వీరిద్దరు అఖాడాలో తమ విధుల్ని కొనసాగిస్తారని, రాబోయే అమృత స్నానంలో పాల్గొంటారని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!