Tamil Nadu Doctor Rape Case: మహిళా డాక్టర్‌పై సామూహిక అత్యాచారం.. నలుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష..
- లేడీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం..
- నలుగురు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..
- 2022లో సంచలనం సృష్టించిన వెల్లూర్ గ్యాంగ్ రేప్ కేసు..
- రాజకీయంగా సంచలనం సృష్టించిన కేసు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Doctor Rape Case:2022లో తమిళనాడులో ఓ మహిళా డాక్టర్‌పై జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులు నలుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ మహిళా కోర్టు తీర్పు చెప్పింది. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
Read Also: Ragging: ‘‘టాయ్‌లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
ఈ నేరంలో అరెస్టయిన నిందితులను ఆటో డ్రైవర్ పార్థిబన్, దినసరి కూలీ కార్మికుడు మణి అలియాస్ మణికందన్, అతడి స్నేహితులు భరత్, సంతోష్‌లుగా గుర్తించారు. ఐదవ నిందితుడు బాలనేరస్తుడు కావడంతో జువైనల్ బోర్డ్ ముందు విచారణ ఎదుర్కొంటున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిన గురువారం వెల్లూర్ సెషన్స్ జడ్జి(ఫాస్ట్ ట్రాక్ మహిళా కోర్టు) ఎస్ మాగేశ్వరి భాను రేఖ ముందు హాజరుపరిచారు, వీరికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 25,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
బాధిత వైద్యురాలు, తన పురుష సహోద్యోగితో కలిసి మార్చి 16, 2022న తెల్లవారుజామున 12.30 గంటలకు కాట్పాడిలో ఆటో కోసం వేచి చూస్తుండగా, ఆటోలో వచ్చిన ఐదుగురు సభ్యుల ముఠా, షేర్ ఆటో అని చెప్పి వారిని ఎక్కించుకున్నారు. ఇద్దరిని పాలర్ నది ఒడ్డుకు తీసుకెళ్లారు. అక్కడ ముఠా వైద్యురాలు, ఆమె ఫ్రెండ్‌పై దాడి చేసి, కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశారు. ఇద్దరి మొబైల్ ఫోన్లతో పాటు బంగారు ఆభరణాలను, ఏటిఎం కార్డుని తీసుకుని పారిపోయారు. కార్డ్ నుంచి రూ. 40,000 విత్ డ్రా చేశారు. తాగిన మత్తులో ముఠాలోని ముగ్గురు సభ్యులు గొడవ పడిన కేసుని విచారిస్తుండగా, ఈ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత లేడీ డాక్టర్ నుంచి పోలీసులు ఆన్‌లైన్ ఫిర్యాదుతో కేసుని విచారించి, నిందితులకు శిక్ష పడేలా చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి భూముల ఎపిసోడ్ విచారణ ప్రారంభం
-
Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
-
Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!