Ragging: ‘‘టాయ్‌లెట్ సీటుని నాకించారు’’.. ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
- ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల విద్యార్థి బలి..
- టాయిలెట్ సీటుని నాకించి వికృత చేష్టలు..
- అవమానం భరించలేక ఆత్మహత్య..
- తన కొడుకు బాధల్ని సోషల్ మీడియాలో వెల్లడించిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragging: ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడదు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్‌లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Read Also: Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
‘‘మిహిర్‌ని కొట్టారు. తిట్టారు. అతడి చివరి రోజు ఎవరూ ఊహించలేని అవమానాన్ని భరించాడు. అతడిని బలవంతంగా వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లారు. టాయిలెట్ సీటను బలవంతంగా నాకించారు. టాయిలెట్ ఫ్లష్ చేసిన తర్వాత అతడి తలను టాయిలెట్‌లో పెట్టారు. ఈ క్రూరమైన చర్యలు అతడి జీవితాన్ని విచ్ఛిన్నం చేశాయి.’’ ఆమె చెప్పింది. తన కొడుకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుసుకునేందుకు తాను, తన భర్త సమాచారాన్ని సేకరించామని రజ్నా చెప్పారు. స్నేహితులు, పాఠశాల సహచరులతో మాట్లాడిన తర్వాత, తన కొడుకు ఎంతటి బాధల్ని అనుభవించాడో తెలుసుకున్నామని, పాఠశాలలో, స్కూల్ బస్సులో విద్యార్థులు మిహిర్‌ని క్రూరంగా ర్యాగింగ్ చేశారని, కొట్టారని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కేవలం శారీరక వేధింపులే కాకుండా, అతడి చర్మం రంగుని ఆధారంగా చేసుకుని దూషించారని, ఎగతాళి చేశారని చెప్పారు. తన కొడుకు మరణించడాన్ని కొందరు సెలబ్రేట్ చేసుకున్నారని ఆమె పేర్కొంది. తన కొడుకు మరణంపై నిష్పాక్షిక దర్యాప్తుని కోరుతూ, సేకరించిన ఆధారాలను సీఎం ఆఫీస్, డీజీపీ ఆఫీస్‌కి సమర్పించినట్లు తెలిపారు. త్రిప్పునితురలోని హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే, డిజిటల్ ఆధారాలు సేకరించడంలో జాప్యం నేరస్తుల ఆధారాలు చెరిపేసే వీలుందని మిహిర్ తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకుకి న్యాయం చేయాలని, మిహిర్‌ల మరో బిడ్డ బాధపడకూదని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?