Sonia Gandhi: పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘‘పూర్ లేడీ’’ అని స్పందించడంపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఈ మేరకు రాష్ట్రపతిని అవమానించే, కించపరిచే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ‘‘సభా హక్కుల తీర్మానం’’ ప్రవేశపెట్టారు. జనవరి 31న పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు.
NVS-02 NavIC: ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ఇటీవల NVS-02 శాటిలైట్‌ని ప్రయోగించింది. భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో నావిక్ కాన్స్టలేషన్లో భాగంగా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు.
Aaradhya Bachchan: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అనేక వెబ్సైట్లలో తన ఆరోగ్యం గురించి నకిలీ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు పిటిషన్లో ఆమెకు సంబంధించిన కంటెంట్‌ని తొలగించాలంటూ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా అకౌంట్ బాలీవుడ్ టైమ్స్, ఇతర వెబ్సైట్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే, దీనికి కొనసాగింపుగా ఆరాధ్య కొత్త పిటిషన్ దాఖలు చేశారు.
Jaya Bachchan: మహ కుంభమేళాపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలోని గంగా, యమునా నదుల్లోని నీరు కలుషితమైందని ఆమె సోమవారం ఆరోపించారు. గత నెలలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేసినందుకు, నదిలోని నీరు కలుషితమైందని అన్నారు.
S Jaishankar: లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు, జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారం సభలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదానికి కారణమైంది.
Rahul Gandhi: సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్డీయే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోడీకి, అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ స్వీకారోత్సవానికి ఆహ్వానంపై ఆయన ఆరోపణలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది.
Cremation dispute: అన్నదమ్ముల మధ్య తండ్రి అంత్యక్రియల వివాదం ఏకంగా, తండ్రి మృతదేహాన్ని సగం నాకు ఇవ్వాలని అనే దాకా వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టికామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. తండ్రి అంత్యక్రియల్లో సోదరుల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో అంత్యక్రియల వివాదంలో పోలీసులు, అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. టికామ్‌గఢ్ జిల్లాల ప్రధాన కార్యాలయం నుంచి 45 కి.మీ దూరంలో ఉన్న లిధోరాతాల్ గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. చిన్న కుమారుడు దేశ్రాజ్ […]
Blackmail: బ్లాక్మెయిల్, శారీరక హింసను ఎదుర్కొంటున్న మహిళ, ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ బరేలీలో జరిగింది. అతడితో సెక్స్ చేస్తున్న సమయంలో, గొంతు కోసి హతమార్చింది. తనను లైంగిక చర్యల కోసం బ్లాక్మెయిల్ చేస్తుండటంతోనే హత్యకు పాల్పడినట్లు మహిళ వెల్లడించింది. తనకు వేరేమార్గం లేకపోయిందని పోలీసులకు తెలిపింది. మరణించిన వ్యక్తిన ఇక్బాల్‌గా గుర్తించారు. మృతదేహం అతడి ఇంటికి సమీపంలో దొరికిన 2 రోజుల తర్వాత హత్య చేసిన 32 ఏళ్ల మహిళని అరెస్ట్ చేశారు.
Kumbh stampede: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది వరకు భక్తులు మరణించారు. 60 మంది వరకు గాయపడ్డారు. అయితే, ఈ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మెరుగైన నిర్వహణ విధానాలను కోరుతూ పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ రోజు పిటిషన్‌పై విచారించిన అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది దురదృష్టకరమైన సంఘటన, ఆందోళన కలిగించే విషయం, కానీ మీరు దీనిపై హైకోర్టుని ఆశ్రయించండి. […]