Venu Goapl Reddy
Author- NTV Telugu-
H-1B Visa Row: ‘‘మా దేశానికి వచ్చేయండి, ఎక్కువ సంపాదిస్తారు’’.. H-1B వివాదం మధ్య జర్మనీ ఆహ్వానం..
H-1B Visa Row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్‌ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది. -
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాదులకు సహకరించిన కాశ్మీర్ వ్యక్తి అరెస్ట్..
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో టెర్రరిస్టులకు సహకరించిన స్థానిక కాశ్మీర్ వ్యక్తులను అధికారులు గుర్తిస్తున్నారు. పహల్గామ్ బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన 5 నెలల తర్వాత, భద్రతా సంస్థలు బుధవారం ఉగ్రవాదులకు లాజిస్టిక్ మద్దతు ఇచ్చిన కాశ్మీర్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కుల్గాం నివాసి అయిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని 14 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు. -
Finland: ‘‘భారత్ ఒక సూపర్ పవర్’’..ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ప్రశంసలు..
Finland: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. రష్యా, చైనాల నుంచి భారత్‌ను వేరే చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ‘‘సూపర్ పవర్’’గా కొనియాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు, శాంతి చర్చల్లో భారత పాత్రను నొక్కి చెప్పారు. సాంకేతికత-వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్-ఫిన్లాండ్ సంబంధాలు బలోపేతం అవుతాయని అన్నారు. -
UNGA: వాహ్… ముస్లిం దేశాధినేత నోటి నుంచి ‘‘ఓం శాంతి, షాలోమ్’’..
UNGA: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాల్లో ఉక్రెయిన్ యుద్ధం, గాజా యుద్ధం ముఖ్యాంశాలుగా నిలిచాయి. ప్రపంచ దేశాధినేతలు ముఖ్యంగా ఈ రెండింటిపైనే ప్రసంగించారు. అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఇచ్చిన ప్రసంసం వైరల్‌గా మారింది. ఈ యుద్ధాల ముగిసి ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆయన అన్ని మతాల్లో దేవుడిని ప్రార్థించారు. -
Turkey: నువ్వు మారవా ఎర్డోగాన్.. ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ అంశం..
Turkey: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ‘‘కాశ్మీర్’’ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తారు. పలు సందర్భాల్లో ఎర్డోగాన్ భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడారు. తాజాగా, మరోసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ( UNGA ) వార్షిక సమావేశంలో కూడా కాశ్మీర్ అంశంపై మాట్లాడారు. -
Crime: తాత మరణంపై ఫేస్బుక్ పోస్ట్.. హత్యకు దారితీసిన ‘‘లాఫింగ్ ఎమోజీ’’..
Crime: ‘‘లాఫింగ్ ఎమోజీ’’ ఒకరి హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాజ్‌కోట్‌లోని ఒక ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన 20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ అతని ముగ్గురు బంధువులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితంత తన తాత రూప్నారాయణ్ భింద్ మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ, ప్రిన్స్ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. అయితే, ప్రిన్స్‌కు పరిచయస్తుడైన బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ ఈ పోస్టుకు ‘‘నవ్వుతున్న ఎమోజీ’’ని పెట్టాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది. -
Pakistan: చైనాతో కన్నుగీటి, అమెరికాతో కౌగిలింత.. పాకిస్తాన్ డబుల్ గేమ్..
Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. -
Afzal Guru Grave: “అప్జల్ గురు” సమాధిని తొలగించాలని పిల్.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..
Afzal Guru Grave: ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఉగ్రవాదులు అప్జల్ గురు, మక్బూల్ భట్ సమాధులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కింద నమోదైన ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టేసింది. విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ దాఖలు చేసిన పిల్లో సమాధులు 'తీర్థయాత్ర' స్థలంగా మారాయని పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై డేటాను కోరింది. -
Pakistan: పాకిస్తాన్ స్కూల్ బుక్స్‌లో ‘‘ఆపరేషన్ సిందూర్’’.. అన్ని అబద్ధాలే..
Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది. […] -
Trump: ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనా నిధులు..రష్యన్ చమురు కొనుగోలుపై ట్రంప్..
Trump: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ, భారత్, చైనాలపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్, చైనా నిధులు ఇస్తున్నాయని మండిపడ్డారు. రష్యన్ చమురు కొనుగోలు ద్వారా ఈ రెండు దేశాలు రష్యాకు సహకరిస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారానే యుద్ధానికి ప్రాథమిక నిధుల్ని సమకూరుస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..