Layoffs 2025: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం టెక్ ప్రపంచంలో "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)" మాటే వినిపిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించే దిశగా ఏఐ అడుగులు వేస్తోంది. అయితే, ఇప్పుడు ఏఐ అభివృద్ధి ఉద్యోగులకు చేటు చేయబోతోంది. 2025లో ప్రపంచవ్యాప్తంగా టెక్, ఇతర ఇండస్ట్రీల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. 2025లో భారీ సంఖ్యలో టెక్ లేఆఫ్స్ ఉండబోతున్నాయి.
Maharashtra: మహారాష్ట్ర మహయుతి ప్రభుత్వంలో విభేదాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వ్యవహార శైలి చూస్తే ఇది నిజమని తెలుస్తోంది. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన-షిండే, ఎన్సీపీ-అజిత్ పవార్ల కూటమి ఘన విజయం సాధించింది. అయితే, మరోసారి సీఎం పదవిని కోరుకున్న ఏక్నాథ్ షిండే ఆశ నెరవేరలేదు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు.
Tamil Nadu: తమిళనాడులో మధురై సమీపంలోని కుమారస్వామి దేవాలయం ఉన్న తిరుపరంకుండ్రంపై వివాదం చెలరేగింది. తమిళులు ఎంతో భక్తిగా పూజించే సుబ్రమణ్య స్వామి కొలువుదీరిన కొండని కొందరు ముస్లింలు అపవిత్రం చేశారని హిందూ సంఘాలు తీవ్ర నిరసన తెలుపుతున్నాయి.
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా.
Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్…
Hezbollah: గతేడాది సెప్టెంబర్ నెలలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హతమైన హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 23న అంత్యక్రియలు జరుగుతాయని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్ర సంస్థ హిజ్బుల్లా ప్రస్తుతం చీఫ్ నయీమ్ కస్సేమ్ ఆదివారం తెలిపారు. లెబనాన్ బీరూట్‌కి సమీపంలోని ఒక బంకర్‌పై వైమానిక దాడి చేసిన ఇజ్రాయిల్, నస్రల్లాని హతమార్చింది.
PM Modi: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపుల గురించి మాట్లాడారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో ప్రధాని మోడీ ప్రచారం చేశారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ సమయంలో పన్నుల విధానం గురించి విమర్శించారు. నెహ్రూ కాలంలో ఎవరికైనా రూ. 20 లక్షల జీతం ఉంటే పావు వంతు […]
T-shirt: కేవలం రూ. 300 టీ-షర్టుపై చెలరేగిన వివాదం ఒక వ్యక్తి ప్రాణాలను తీసింది. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో టీ షర్టుపై చెలరేగిన వివాదం స్నేహితుడైన 30 ఏళ్ల వ్యక్తిని హత్య చేయడానికి కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం శాంతి నగర్ ప్రాంతంలో శుభమ్ హర్నే(30) అనే వ్యక్తి , టీ-షర్టు కొనుగోలు చేసిన అక్షయ్ ఆసోల్(26)కి రూ. 300 చెల్లించడానికి నిరాకరించాడు. దీనిని అక్షయ్ ఆన్లైన్లో కొనుగోలు చేశారు. ఇది […]