Ranveer Allahbadia: యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
- వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం..
- రణవీర్ అల్లాబాదియాపై ఎఫ్ఐఆర్ నమోదు..
- అస్సాం పోలీసుల తర్వాత మహారాష్ట్ర పోలీసుల చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer Allahbadia: యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాదియా వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. రాజకీయంగా కూడా ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో చేసిన వ్యాఖ్యలపై యూట్యూబర్ల్ సమయ్ రైనా, రణవీర్ అల్లాబాదియా, ఆశిష్ చంచలానీ, అపూర్వ ముఖియాతో పాటు ఇతరులపై మహారాష్ట్ర పోలీసులు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కామెడీ షోలోని అన్ని ఎపిసోడ్లను సైబర్ బ్రాంచ్ సమీక్షించిన తర్వాత కేసు నమోదైంది.
Read Also: Beauty Tips: ముఖంపై మచ్చలు, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి
Also Read
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
ఈ వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంపై ఇది రెండో కేసు. అంతకుముందు అస్సాం పోలీసులు యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా, హాస్యనటుడు సమయ్ రైనా, ఇతర ఇన్‌ఫ్లూయెన్సర్లు “అశ్లీలతను ప్రోత్సహించడం, లైంగికంగా అసభ్యకరమైన, అసభ్యకరమైన చర్చలో పాల్గొనడం” అనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర పోలీసులు 30 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసులు కొంతమంది నిందితులకు సమన్లు జారీ చేయగా, మరికొందరిన్ని విచారణకు పిలిపించనున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 67 (ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అశ్లీల విషయాలను ప్రసారం చేయడం), భారతీయ న్యాయ సంహితలోని ఇతర సంబంధిత విభాగాల కింద ఈ కేసు నమోదు చేయబడింది.
‘‘ఇండియాస్ గాట్ లాలెంట్ షో’’లో రణవీర్ అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. షోకి వచ్చిన ఒక మహిళా కంటెస్టెంట్‌తో..‘‘ మీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం జీవితాంతం చూస్తావా..? లేదా ఒక సారి వారితో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా..?’’ అంటూ అడిగాడు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా షోకి హాజరైన వారు షాక్ అయ్యారు. ఈ కామెంట్స్‌పై అందరు మండిపడటంతో అతను క్షమాపణలు చెప్పాడు.
తాజావార్తలు
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!